AP BJP: రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ‘ధర్నా’ కార్యక్రమాలకు పిలుపునిచ్చిన ఏపీ బీజేపీ

రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో 'ధర్నా' కార్యక్రమాలకు పిలుపునిచ్చింది ఏపీ బీజేపీ. వినాయకచవితి పండుగ

AP BJP: రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో 'ధర్నా' కార్యక్రమాలకు పిలుపునిచ్చిన ఏపీ బీజేపీ
Somu Veerraju
Follow us

|

Updated on: Sep 07, 2021 | 8:23 PM

Ganesh Festival – AP: రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ‘ధర్నా’ కార్యక్రమాలకు పిలుపునిచ్చింది ఏపీ బీజేపీ. వినాయకచవితి పండుగ సందర్భంగా కోవిడ్ నిబంధనలకు లోబడి వాడవాడలా పందిళ్ళు వేసుకుని ఉత్సవాలు జరుపుకోవడానికి ఆనుమతించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టబోతోంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించి, తహశీల్దార్‌లకు మెమోరాండాలు ఇవ్వాలని మండల, జిల్లా పార్టీ శ్రేణులకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పిలుపు నిచ్చారు.

గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇచ్చే వరకూ భారతీయ జనతా పార్టీ యావత్ హిందూ సమాజంతో కలిసి తన పోరాటాలను కొనసాగిస్తుందని సోము వీర్రాజు అన్నారు. నిబంధనల పేరిట హిందూదేవుళ్ళను అవమానకరమైన రీతిలో చెత్త ట్రక్కుల్లో తరలిస్తున్నారంటూ ఆయన విమర్శలు చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వీడియోలు పెట్టి ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ అరచకాలను తెలియజేస్తూ, గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కర్నూల్ బీజేపీ ఆధ్వర్యంలోని BJP బృందం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ గారిని కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని సోము పేర్కొ్న్నారు.

సంవత్సరమంతా ఎంతోకష్టపడి అప్పులు చేసుకొని, ఎక్కడెక్కడినుంచో వచ్చి గణేష్ విగ్రహాలను తయారుచేసి, వాటిమీదనే ఆధారపడి బ్రతికేవాళ్ళ జీవితాల్లో గాఢాంధకారాన్ని నింపుతూ, ఇలా దౌర్జన్యంగా ప్రభుత్వాధికారులు గణేష్ విగ్రహాలను చెత్తట్రక్కుల్లో తరలిస్తుంటే హిందూ సమాజం చూస్తూ ఉంటుందా? అని సోము చెప్పుకొచ్చారు. మొదట హిందూ ఆలయాలపై దాడులు చేశారు, ఇప్పుడు గణేష్ ఉత్సవాలను నిషేధించడం ద్వారా వైయస్ జగన్ ప్రభుత్వం హిందూ సంస్కృతిని నాశనం చేస్తోందంటూ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.

Read also: Baby Shower: మహిళా కానిస్టేబుల్‌కు అరుదైన గౌరవం.. సహచరుల సమక్షంలో పోలీస్ స్టేషన్‌లో సీమంతం