Oxygen Cylinder Explode: పెట్రోల్ బంక్ దగ్గర ఆక్సిజన్ సిలిండర్ పేలుడు.. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు, ఆటో ధ్వంసం

ప్రమాదవశాత్తు ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలైన సంఘటన తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో చోటు చేసుకుంది.

1/4

2/4
మండపేట రూరల్ ఎస్.ఐ బళ్ల శివ కృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం టాటా ఏస్ వాహనంలో ఆక్సిజన్ సిలిండర్ లను తీసుకువస్తుండగా ద్వారపూడి పెట్రోల్ బంక్ వద్దకు వచ్చేసరికి ప్రమాదవశాత్తు సిలిండర్ పేలిపోయింది.

3/4
దీంతో వాహనం వెనుక వస్తున్న మోటార్ సైక్లిస్ట్ తలకు తీవ్ర గాయమైంది. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

4/4
క్షతగాత్రుడిని పోలీస్ జీపులో అనపర్తి తరలించారు. కాగా టాటా ఏస్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ తెలిపారు.

Click on your DTH Provider to Add TV9 Telugu