బోర్డర్ చెక్‌పోస్ట్‌లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి.. విచారించగా వెలుగులోకి షాకింగ్ నిజం!
కిడ్నాప్ జరిగిన మూడు గంటల్లోనే బాలుడ్ని సురక్షితంగా తల్లికి అప్పగించి.. శభాష్ అనిపించుకున్నారు పోలీసులు. ఇంతకీ కిడ్నాప్ చేసింది ఎవరో కాదు.! అసలు ట్విస్ట్ అదిరిపోతుంది.. ఆ స్టోరీ ఏంటో మీరూ చూసేయండి.. ఈ ఆర్టికల్ చదవండి..
కిడ్నాప్ జరిగిన మూడు గంటల్లోనే బాలుడ్ని సురక్షితంగా తల్లికి అప్పగించి.. శభాష్ అనిపించుకున్నారు పోలీసులు. ఇంతకీ కిడ్నాప్ చేసింది ఎవరో కాదు.! కన్న తండ్రే బాలుడిని కిడ్నాప్ చేశాడు. అనంతపురం జిల్లా శెట్టూరు మండలం చిన్నంపల్లికి చెందిన తిమ్మక్కకు.. కర్ణాటక రాష్ట్రం అచ్చంపల్లి గ్రామానికి చెందిన సంజీవరాయుడితో 11 ఏళ్ల కిందట వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో విడాకులు కూడా తీసుకున్నారు. అప్పటి నుంచి తిమ్మక్క కుమారుడు రంజిత్‌తో కలసి చిన్నంపల్లిలోనే నివసిస్తోంది. రంజిత్ చిన్నంపల్లి పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు.
తండ్రి సంజీవరాయుడు చిన్నంపల్లికి వచ్చి రంజిత్‌కు మాయమాటలు చెప్పి.. కిడ్నాప్ చేసి, ద్విచక్రవాహనంపై ఎత్తుకెళ్లాడు. బాలుడి కిడ్నాప్ విషయం తెలుసుకున్న తల్లి.. శెట్టూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బాలుడి కోసం వేట ప్రారంభించారు. కంబదూరు దగ్గరలోని ఆంధ్రా, కర్ణాటక బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద తండ్రి సంజీవరాయుడు.. బాలుడిని తీసుకుని వెళుతుండగా పోలీసులు గుర్తించారు. వెంటనే అరెస్టు చేసి బాలుడు రంజిత్‌ను తల్లి తిమ్మక్కకు అప్పగించారు. కేవలం 3 గంటల్లో కిడ్నాప్‌ను చేధించి పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. దీంతో బాలుడు కిడ్నాప్ కథ సుఖాంతమైంది.