Andhra Pradesh: మరణించి చిరంజీవి.. అవయవదానంతో మరికొందరికి జీవితాన్ని ఇచ్చిన యువకుడు
బ్రెయిన్ డెడ్ అయిన జగదీష్ అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో హుటాహుటిన ఆసుపత్రి వర్గాలు అవయవాలు తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. జగదీష్ కి చెందిన కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండె తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్ లో కర్నూల్ ఎయిర్పోర్ట్ అక్కడ నుంచి హైదరాబాద్ వైజాగ్ కు స్పెషల్ ఫ్లైట్ లో అవయవాలు తరలించారు.

మరణించే చిరంజీవులు కొందరు ఉంటారు. తాను చనిపోయినా.. మరో ముగ్గురిని బ్రతికించాడు. చనిపోయిన వ్యక్తి అవయవాలు దానం చేసి మరికొందరు ప్రాణాలు కాపాడొచ్చు అని స్ఫూర్తిదాయకంగా నిలిచారు ఆ కుటుంబ సభ్యులు… అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రానికి చెందిన జగదీష్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బ్రెయిన్ డెడ్ అయిన జగదీష్ అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో హుటాహుటిన ఆసుపత్రి వర్గాలు అవయవాలు తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. జగదీష్ కి చెందిన కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండె తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్ లో కర్నూల్ ఎయిర్పోర్ట్ అక్కడ నుంచి హైదరాబాద్ వైజాగ్ కు స్పెషల్ ఫ్లైట్ లో అవయవాలు తరలించారు. కూలి పనులు చేసుకునే జగదీష్ ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయి చనిపోవడంతో అవయవ దానం చేసి కుటుంబ సభ్యులు ఆదర్శంగా నిలిచారు. దీంతో వెంటనే ఆసుపత్రి వర్గాలు అనంతపురం నుంచి హైదరాబాద్ కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు.
కర్నూలు ఎయిర్పోర్ట్ వరకు అవయవాలను అంబులెన్సులో తరలించారు. కర్నూల్ లో ఓ రోగికి కిడ్నీలు, సికింద్రాబాద్ లో ఉన్న మరో రోగికి ఊపిరితిత్తులు, విశాఖపట్నంలో మరొక రోగికి గుండె తరలించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో అవయవాలు తరలించారు. జగదీష్ కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని ఆసుపత్రి వైద్యులతో పాటు అందరూ ప్రశంసించారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా బతకొచ్చు అని అవయవదానం ద్వారా ఇది సాధ్యమవుతుందని జగదీష్ కుటుంబ సభ్యులు అందరికీ ఆదర్శంగా నిలిచారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
