AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anantapur: ఒకే యువకుడిని ప్రేమించిన ఇద్దరమ్మాయిలు.. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ట్విస్ట్

అనంతపురంలో లవ్ ట్రయాంగిల్ విషాదాంతమైంది. పెనుకొండ మండలం గొందిపల్లికి చెందిన బీకాం విద్యార్థిని స్వాతి ఆత్మహత్య చేసుకుంది. ఒకే యువకుడిని ప్రేమించిన ఇద్దరు యువతుల మధ్య తలెత్తిన విభేదాలు విషాదం మిగిల్చాయి. మరో యువతి ప్రతిభ భారతి బెదిరింపులకు భయపడి స్వాతి హాస్టల్ గదిలో ఉరేసుకుంది.

Anantapur: ఒకే యువకుడిని ప్రేమించిన ఇద్దరమ్మాయిలు.. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ట్విస్ట్
Parthiba Bharathi - Arun -Swathi
Nalluri Naresh
| Edited By: Ram Naramaneni|

Updated on: Aug 26, 2025 | 7:13 PM

Share

అనంతపురం నగరంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషాదంగా మారింది. ఓ ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడంతో కేసులో ట్విస్టులు బయటకు వస్తున్నాయి. ఒకే యువకుడిని ఇద్దరు యువతులు ప్రేమించారు. ఇద్దరితోనూ ప్రేమాయణం నడిపిన యువకుడి కారణంగా.. మొదటి ప్రియురాలు రెండో ప్రియురాలిని బెదిరించగా.. ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గొందిపల్లి గ్రామానికి చెందిన పూజారి స్వాతి, అనంతపురంలోని నలందా డిగ్రీ కళాశాలలో బీకాం మూడో సంవత్సరం చదువుతోంది. ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ.. చదువుతో పాటు దీపు రక్త పరీక్షా కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పార్ట్‌టైమ్ జాబ్ చేస్తోంది. అక్కడే ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న అరుణ్ కుమార్‌ను అన్న అని, అతని ప్రియురాలు ప్రతిభా భారతిని వదినా అని స్వాతి పిలుస్తుండేది. కానీ పరిచయం పెరగడంతో అరుణ్ కుమార్.. స్వాతి ప్రేమలో పడ్డారు.

అరుణ్ ఇప్పటికే ప్రతిభా భారతి అనే యువతితో ప్రేమలో ఉన్నాడు. ఇద్దరమ్మాయిలతోనూ సంబంధం కొనసాగించడంతో అనుమానం వచ్చిన ప్రతిభా భారతి, అరుణ్ ఫోన్‌లోని వాట్సాప్ చాటింగ్ చెక్ చేసింది. అక్కడి నుంచే అసలు విషయం బయటపడింది. కోపంతో ఊగిపోయిన ప్రతిభ..  స్వాతిని ఫోన్‌లో నిలదీసి.. అన్న అని పిలుస్తూ, వదినా నన్ను పిలుస్తూ నా ప్రియుడిని ప్రేమ వేశాలు ఏంటని ప్రశ్నించింది. అంతటితో ఆగకుండా.. నీ బండారం అంతా బయటపెడతా… రక్తపరీక్షా కేంద్రం దగ్గరే నీ కథ తేలుస్తా అంటూ బెదిరించింది.

ఈ బెదిరింపులు, పరువు పోతుందన్న భయంతో స్వాతి తీవ్ర మనస్థాపానికి గురైంది. చివరికి హాస్టల్ గదిలో చున్నీతో ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్వాతి తండ్రి పూజారి నాగభూషణం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్వాతిని బెదిరించిన మొదటి ప్రియురాలు ప్రతిభా భారతి, అలాగే ఇద్దరమ్మాయిలతోనూ ప్రేమాయణం నడిపిన అరుణ్ కుమార్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..