AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 ఏళ్లుగా చిక్కకుండా తిరుగుతున్న ముఠా.. ఎట్టకేలకు చెక్‌పెట్టిన పోలీసులు.. ఇంతకు ఏం చేశారంటే!

రోడ్లపై పక్కన పొదల్లో దాక్కొని.. అటుగా వెళ్లే జనాలపై దాడులకు పాల్పడుతూ అందినకాడికి బంగారం, డబ్బు దోచుకుంటూ.. జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఓ దోపిడి ముఠాకు నంద్యాల పోలీసులు చెక్‌పెట్టారు. ఎనిమిదేళ్లుగా చిక్కకుకుండా తిరుగుతున్న ఈ ముఠాను పాణ్యం పిన్నాపురం కొండల్లో నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురి ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

8 ఏళ్లుగా చిక్కకుండా తిరుగుతున్న ముఠా.. ఎట్టకేలకు చెక్‌పెట్టిన పోలీసులు.. ఇంతకు ఏం చేశారంటే!
Andhra News
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Aug 26, 2025 | 7:49 PM

Share

రోడ్లపై పక్కన పొదల్లో దాక్కొని.. అటుగా వెళ్లే జనాలపై దాడులకు పాల్పడుతూ అందినకాడికి బంగారం, డబ్బు దోచుకుంటూ.. జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఓ దోపిడి ముఠాకు నంద్యాల పోలీసులు చెక్‌పెట్టారు. ఈ ముఠాను పాణ్యం పిన్నాపురం కొండల్లో నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు ఎనిమిది సంవత్సరాల కాలంగా నంద్యాల, కర్నూలు, గుంటూరు, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో పలు చోరిలకు పాల్పడుతూ.. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. ఈ క్రమంలో వారిపై ఫోకస్‌ పెట్టిన పోలీసులు పక్కా సమాచారంతో పాణ్యంలోని పిన్నాపురం కొండల్లో నలుగురు దారిదోపిడి దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 10.35 లక్షల విలువగల బంగారు, వెండి నగలను నాలుగు పిడిబాకులు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

పట్టబడిన నిందితుల్లో నంద్యాల జిల్లాకు చెందిన దాసరి అంకన్నపై 34 కేసులు, హరిశ్చంధ్ర సత్యపై 14 కేసులు, చిన్న హుస్సెనిపై 10 కేసులు, దాసరి జమ్ములుపై12 కేసులు ఉన్నట్లు జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఎనిమిది సంవత్సరాల కాలంగా ఐదు జిల్లాల పోలీసులకు చుక్కలు చూపిస్తూ చోరిలకు పాల్పడుతున్న ముఠా పట్టుకున్న పోలీసులకు ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, ఎఎస్పి జావళి రివార్డులు అందించి ప్రోత్సహించారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..