AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బియ్యం కార్డు ఉన్న కుటుంబాలు అన్నింటికి ‘వైఎస్సార్ బీమా’

బియ్యం కార్డు ఉండి, కుటుంబం ఆధారపడ్డ వ్యక్తికి  దురదష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని

బియ్యం కార్డు ఉన్న కుటుంబాలు అన్నింటికి 'వైఎస్సార్ బీమా'
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 20, 2020 | 7:25 AM

Share

YSR Bheema Scheme: బియ్యం కార్డు ఉండి, కుటుంబం ఆధారపడ్డ వ్యక్తికి  దురదష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకాన్ని తీసుకురానుంది. ఈ మేరకు బుధవారం సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ పథకానికి ఆమోదం లభించింది. ఈ పథకం కింద ఓ వ్యక్తి సహజంగా చనిపోతే అతడి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం.. శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే రూ.5 లక్షలు ఇవ్వనున్నారు. 18–50 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఈ పథకం వర్తించనుంది. 51–70 ఏళ్ల వయస్సు వారి కోసం మరో నిబంధన తీసుకొచ్చారు. ఆ వయసు వారికి శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే బాధిత కుటుంబాలకు రూ.3 లక్షలను అందించనున్నారు.

అయితే సామాజిక భద్రత కోసం గతంలో ఎల్‌ఐసీతో కలిసి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేది. కానీ కొంత కాలం క్రితం దీన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పేదలకు భరోసా ఇచ్చేలా ఈ పథకాన్ని పూర్తిగా సొంత నిధులతో అమలు చేయాలని జగన్ ప్రభుత్వ మంత్రి వర్గం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.50కోట్ల బియ్యం కార్డులు ఉండగా.. ఆ కుటుంబాలన్నింటికీ ఈ పథకం వర్తించనుంది. ఇందుకోసం ఏడాదికి రూ.583.50 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

Read More:

సీజనల్ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి: మంత్రి ఆదేశాలు

త్రిపురలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్‌