డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ‘వైఎస్సార్ ఆసరా’కు కేబినెట్ ఆమోదం..

డ్వాక్రా మహిళలకు, విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. నవరత్నాల్లో మరో హామీని అమలు చేసే దిశగా నిర్ణయం తీసుకుంది.

  • Ravi Kiran
  • Publish Date - 2:28 pm, Wed, 19 August 20
డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 'వైఎస్సార్ ఆసరా'కు కేబినెట్ ఆమోదం..

AP Cabinet Decisions: డ్వాక్రా మహిళలకు, విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. నవరత్నాల్లో మరో హామీని అమలు చేసే దిశగా నిర్ణయం తీసుకుంది. ఇవాళ సీఎం అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ‘వైఎస్ఆర్ ఆసరా’ పధకానికి ఆమోదముద్ర వేసింది. ఈ పధకం ద్వారా డ్వాక్రా మహిళలకు నాలుగేళ్లలో రూ. 27 వేల కోట్లకుపైగా లబ్ది చేకూరనుంది.

దీనితో పాటు 2020-23 వరకు అమలు కానున్న నూతన పారిశ్రామికవిధానానికి, పంచాయతీ రాజ్ శాఖలోని 51 డివిజినల్ డెవలప్ మెంట్ అధికారుల పోస్టుల భర్తీకి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అటు కడప, చిత్తూరు జిల్లాల్లో ఏర్పాటైన ప్రభుత్వ కాలేజీల్లో పోస్టుల భర్తీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా సెప్టెంబర్ 1వ తేదీన ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పధకం, సెప్టెంబర్ 5న ‘వైఎస్సార్ విద్యా కానుక’, సెప్టెంబర్ 11న ‘వైఎస్సార్ ఆసరా’ పధకాలను ప్రారంభించేందుకు డేట్లను ఖరారు చేసింది.

Also Read:

తెలంగాణలో విస్తరిస్తున్న కొత్త వైరస్.. ఆందోళనలో రైతులు..

మరో కరోనా లక్షణం.. బాధితుల్లో హెయిర్ లాస్..!

ఏపీలో ఇకపై రిజిస్ట్రేషన్ ప్రక్రియ వీడియో రికార్డింగ్..!