AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్ అన్న సీఎం అయితే మేమంతా సీఎంలమే..

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే తామంతా ముఖ్యమంత్రులం అయినట్టే అని వ్యాఖ్యానించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. అమరావతిలో సీఎం జగన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా… జగన్‌ను సీఎం చేయడానికే తాము ఇంతకాలంగా పని చేశామని అన్నారు. తాను అలక వహించినట్టు మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని రోజా స్పష్టం చేశారు. రాజన్న రాజ్యం తీసుకురావడానికి తామంతా కలిసి కష్టపడ్డామని అన్నారు. మీడియాలో పలు వార్తలు రావడం వల్ల తన అభిమానులు బాధపడ్డారని […]

జగన్ అన్న సీఎం అయితే మేమంతా సీఎంలమే..
Ram Naramaneni
|

Updated on: Jun 11, 2019 | 8:36 PM

Share

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే తామంతా ముఖ్యమంత్రులం అయినట్టే అని వ్యాఖ్యానించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. అమరావతిలో సీఎం జగన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా… జగన్‌ను సీఎం చేయడానికే తాము ఇంతకాలంగా పని చేశామని అన్నారు. తాను అలక వహించినట్టు మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని రోజా స్పష్టం చేశారు. రాజన్న రాజ్యం తీసుకురావడానికి తామంతా కలిసి కష్టపడ్డామని అన్నారు. మీడియాలో పలు వార్తలు రావడం వల్ల తన అభిమానులు బాధపడ్డారని ఆమె అన్నారు. ఎమ్మెల్యేగా తమకు తమ నియోజకవర్గం అభివృద్ధే ముఖ్యమన్న రోజా… వైసీపీ ప్రభుత్వం అమలు చేయబోయే నవరత్నాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళతామని వ్యాఖ్యానించారు.

అంతకుముందు మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తితో ఉన్నారని ప్రచారంలో ఉన్న రోజా… అమరావతి వచ్చి సీఎం జగన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేబినెట్‌లో కుల సమీకరణాల వల్లే తనకు మంత్రి పదవి రాలేదని ఈ సమావేశానికి ముందు అభిప్రాయపడ్డారు. తనకు నామినేట్ పోస్టు ఇస్తారన్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. తనను అమరావతి రావాలని ఎవరూ పిలవలేదని… తాను సీఎం జగన్‌ను కలుసుకునేందుకు వచ్చారని అన్నారు.

Follow Us
జబర్దస్త్‌పై టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్!
జబర్దస్త్‌పై టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్!
మంచం మీద కూర్చుని భోజనం చేస్తున్నారా? ఇది తప్పక తెలుసుకోండి
మంచం మీద కూర్చుని భోజనం చేస్తున్నారా? ఇది తప్పక తెలుసుకోండి
రా రమ్మంటూ రహదారి వేస్తున్నసముద్రం! రెండుగా విడదీస్తూ మాయా మార్గం
రా రమ్మంటూ రహదారి వేస్తున్నసముద్రం! రెండుగా విడదీస్తూ మాయా మార్గం
పెళ్లి కాలేదని చిన్నచూపు చూస్తున్నారా? గౌరవం దక్కే సూత్రాలివే
పెళ్లి కాలేదని చిన్నచూపు చూస్తున్నారా? గౌరవం దక్కే సూత్రాలివే
ఏలినాటి శని, అర్ధాష్టమ శనితో బాధపడుతున్నారా? ఇది తెలుసుకోండి
ఏలినాటి శని, అర్ధాష్టమ శనితో బాధపడుతున్నారా? ఇది తెలుసుకోండి
ఇలా చేస్తే చాలు చపాతీలు ఎన్ని గంటలైనా దూదిలా మెత్తగా ఉంటాయి..
ఇలా చేస్తే చాలు చపాతీలు ఎన్ని గంటలైనా దూదిలా మెత్తగా ఉంటాయి..
ఈ రాశి అమ్మాయిల సహనం ముందు ఎవరైనా తలవంచాల్సిందే..
ఈ రాశి అమ్మాయిల సహనం ముందు ఎవరైనా తలవంచాల్సిందే..
బంగారం మార్కెట్‌కు భారీ షాక్.. నాలుగు రోజుల్లోనే ఇంత జరిగిందా..?
బంగారం మార్కెట్‌కు భారీ షాక్.. నాలుగు రోజుల్లోనే ఇంత జరిగిందా..?
హార్దిక్ లేకపోవడమే ముంబైకి కలిసొచ్చిందా?
హార్దిక్ లేకపోవడమే ముంబైకి కలిసొచ్చిందా?
ఈ ఆటోలో ఎక్కిన వారికి చలితో వణుకే! డ్రైవర్ అదిరిపోయే ఐడియాకు ఫిదా
ఈ ఆటోలో ఎక్కిన వారికి చలితో వణుకే! డ్రైవర్ అదిరిపోయే ఐడియాకు ఫిదా