సీఎం జగన్ ఆదేశాలు.. ఫైన్ లేకుండానే వాహనాలకు విముక్తి..!

ఏపీలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడిన వాహనాలకు విముక్తి కలిగింది. అపరాధ రుసుము లేకుండానే వాహన యజమానులకు వాహనాలను ఇచ్చేస్తున్నారు పోలీసులు.

సీఎం జగన్ ఆదేశాలు.. ఫైన్ లేకుండానే వాహనాలకు విముక్తి..!
Follow us

| Edited By:

Updated on: May 24, 2020 | 7:32 PM

ఏపీలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడిన వాహనాలకు విముక్తి కలిగింది. అపరాధ రుసుము లేకుండానే వాహన యజమానులకు వాహనాలను ఇచ్చేస్తున్నారు పోలీసులు. అయితే తిరిగి తప్పు చేయకుండా వాహనదారుల నుంచి బాండ్స్ రూపంలో పూచికత్తు తీసుకున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ కింద మాత్రం సీజ్ చేసిన వాహనాలకు నామమాత్రపు ఫెనాల్టీని వసూలు చేశారు. విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో ఇవాళ వాహనాలు విడుదల చేస్తున్నారు పోలీసులు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌ల వద్ద భౌతిక దూరం పాటిస్తూ వాహనాలను తీసుకుంటున్నారు యజమానులు.

ఈ సందర్భంగా వాహనాదారులు మాట్లాడుతూ.. ఫైన్ లేకుండా వాహనాలు ఇచ్చేయటం ఆనందంగా ఉందని అంటున్నారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఇక మరోవైపు సీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. కంటైన్మెంట్ జోన్ లలో నిబంధనలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. విజయవాడలోని కంటైన్‌మెంట్ జోన్లలో తప్ప మిగిలిన అన్ని చోట్ల దుకాణాలు తెరుచుకోవచ్చునని.. కంటైన్‌మెంట్ జోన్లు లేని చోట కొత్త కరోనా కేసులు వస్తే ఆంక్షలు విధిస్తామని అన్నారు. రాత్రి ఏడుగంటల నుంచి ఉదయం ఏడుగంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని అన్నారు. ఇక రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఇంటి వద్దే జరుపుకోవాలని సూచించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన  వాహనదారులను నుంచి కేవలం రూ. 100 జరిమాన వసూలు చేస్తే సరిపోతుందని, అయితే మరోసారి నిబంధనలను ఉల్లంఘించబోమంటూ వారి నుంచి స్వీయ హమీ పత్రాన్ని తీసుకోవాలని పోలీసు శాఖకు జగన్ సూచించిన విషయం తెలిసిందే.

Read This Story Also: Breaking: ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు..!

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు