మా పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగాయి: డీజీపీకి టీడీపీ నేతల ఫిర్యాదు

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను టీడీపీ నేతలు కలిశారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా వారు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ఫలితాల తరువాతి నుంచి టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని.. ఆరుగురు టీడీపీ కార్యకర్తలపై హత్య చేశారని నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్యకర్తలపై 80 భౌతిక దాడులు, 54చోట్ల ఆస్తులను ధ్వంసం చేశారని వారు వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని ఈ సందర్భంగా ఆయనకు విన్నవించారు. డీజీపీని కలిసిన వారిలో చినరాజప్ప, సోమిరెడ్డి […]

మా పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగాయి: డీజీపీకి టీడీపీ నేతల ఫిర్యాదు
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 01, 2019 | 7:45 PM

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను టీడీపీ నేతలు కలిశారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా వారు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ఫలితాల తరువాతి నుంచి టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని.. ఆరుగురు టీడీపీ కార్యకర్తలపై హత్య చేశారని నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్యకర్తలపై 80 భౌతిక దాడులు, 54చోట్ల ఆస్తులను ధ్వంసం చేశారని వారు వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని ఈ సందర్భంగా ఆయనకు విన్నవించారు. డీజీపీని కలిసిన వారిలో చినరాజప్ప, సోమిరెడ్డి ఉన్నారు. కాగా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఇవాళ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిశారు. వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.