జగన్ కు భయం పట్టుకుంది : యనమల

ప్రజాప్రతినిధుల అక్రమాలు, అన్యాయాలు, నేరాలపై త్వరితగతిన విచారణ పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆందోళనలో పడ్డారని...

జగన్ కు భయం పట్టుకుంది : యనమల
Follow us
Anil kumar poka

|

Updated on: Sep 17, 2020 | 8:46 PM

ప్రజాప్రతినిధుల అక్రమాలు, అన్యాయాలు, నేరాలపై త్వరితగతిన విచారణ పూర్తి చేయాలంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆందోళనలో పడ్డారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. వివిధ కేసుల్లో 12 ఛార్జ్ షీట్ లు ఉన్న జగన్ వాటిపై విచారణ, తీర్పుల అంటే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆర్ధిక నేరగాళ్లు అంశంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో జగన్ కు భయం పట్టుకుందని యనమల చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వాల పాలన మీద విచారణపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. అమరావతి రాజధాని విషయంలో ప్రజల దృష్టిని మరల్చడం కోసమే ప్రతిపక్షాలపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని.. మొత్తం 5 ఏళ్ళ పాలనపై విచారణలు జరిపిన సందర్భాలు దేశంలో లేవని యనమల పేర్కొన్నారు.