హైకోర్టు ఆదేశాలు రాజ్యసభలో ప్రస్తావించిన విజయసాయిరెడ్డి
అమరావతి భూముల కుంభకోణం కేసులో న్యాయవ్యవస్థ తీరును వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవ్యవస్థ అసాధారణ రీతిలో ప్రభుత్వంపైన...
అమరావతి భూముల కుంభకోణం కేసులో న్యాయవ్యవస్థ తీరును వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవ్యవస్థ అసాధారణ రీతిలో ప్రభుత్వంపైన, మీడియా, సోషల్ మీడియా, పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రంపైనా ఆంక్షలు విధిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అమరావతి భూముల కుంభకోణానికి సంబంధించిన కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెల్లడించిన తాత్కాలిక ఆదేశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అమరావతి భూముల కుంభకోణంలో మాజీ అడ్వకేట్ జనరల్ ఇతరులపై సీఐడీ నమోదు చేసిన కేసును విచారిస్తూ, ఎఫ్ఐఆర్ వివరాలకు సంబంధించి ఎలాంటి వార్తలు, సమాచారం మీడియా, సోషల్ మీడియాలో ప్రచురణ కాకుండా నిషేధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పైగా సీఐడీ నమోదు చేసిన కేసులో విచారణను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు అసాధారణంగాను, అత్యంత సందేహాస్పదంగా ఉన్నాయంటూ విజయసాయి రాజ్యసభ దృష్టికి తీసుకెళ్లారు.