PM Modi Breach: ప్రధాని మోడీ భద్రతా వైఫల్యంపై చంద్రబాబు ట్వీట్.. ఆందోళన కలిగిస్తోందంటూ.!
ప్రధాని నరేంద్రమోడీ పంజాబ్ పర్యటనలో భాగంగా తలెత్తిన భద్రతా లోపంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు...

ప్రధాని నరేంద్రమోడీ పంజాబ్ పర్యటనలో భాగంగా తలెత్తిన భద్రతా లోపంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రధానమంత్రి భద్రత దేశానికి సంబంధించిన అంశం అని పేర్కొన్న ఆయన.. ప్రధాని పంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతా వైఫల్యం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా చంద్రబాబు పేర్కొన్నారు. ”ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రధాని భద్రత దేశానికి సంబంధించిన అంశం” అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన కేంద్ర హోంశాఖ.. తాజాగా భఠిండా ఎస్‌ఎస్పీకి షోకాజ్ నోటిసులు జారీ చేసింది. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ పరంగా ఎందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకోకూడదో జనవరి 8వ తేదీలోగా వివరణ ఇవ్వాలంటూ కోరింది. అలాగే సుప్రీం కోర్టు.. పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను ప్రధాని పర్యటనకు సంబంధించిన రికార్డులన్నింటినీ భద్రపరచాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యంపై ముగ్గురు సభ్యులతో కూడిన ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read: Viral Photo: ఈ ఫోటోలో పిల్లి దాగుంది.. కనిపెడితే మీరు జీనియస్ అన్నట్లే.!
The recent security breach during @narendramodi Ji’s visit to Punjab is deeply concerning. Prime Minister’s security is nation’s concern.
— N Chandrababu Naidu (@ncbn) January 8, 2022
