సన్నబియ్యానికి అర్హుల జాబితా..మీకార్డు చూసుకోండిలా..

రేషన్‌ కార్డుల ద్వారా ప్రజలకు సన్నబియ్యాన్ని అందజేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, ఆదిశగా కార్యాచరణ అమలుచేస్తున్నారు. ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాల్లో పథకం ప్రారంభించారు. అర్హులందరికీ నాణ్యమైన బియ్యాన్ని అందజేయాలనే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం ప్రత్యేకించి బియ్యం కార్డులను అందజేయనుంది. ఈ మేరకు అర్హుల జాబితాను విడుదల చేసింది. ఈ నెల 20, 21, 22 తేదీల్లో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లోని నోటీసు బోర్డుల్లో సంబంధిత లిస్ట్‌ అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్రంలో […]

సన్నబియ్యానికి అర్హుల జాబితా..మీకార్డు చూసుకోండిలా..
Follow us
Anil kumar poka

|

Updated on: Dec 20, 2019 | 1:30 PM

రేషన్‌ కార్డుల ద్వారా ప్రజలకు సన్నబియ్యాన్ని అందజేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, ఆదిశగా కార్యాచరణ అమలుచేస్తున్నారు. ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాల్లో పథకం ప్రారంభించారు. అర్హులందరికీ నాణ్యమైన బియ్యాన్ని అందజేయాలనే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం ప్రత్యేకించి బియ్యం కార్డులను అందజేయనుంది. ఈ మేరకు అర్హుల జాబితాను విడుదల చేసింది. ఈ నెల 20, 21, 22 తేదీల్లో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లోని నోటీసు బోర్డుల్లో సంబంధిత లిస్ట్‌ అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న తెల్ల రేషన్‌కార్డులతో పాటు అర్హత ఉండి కార్డులేని వారికి ప్రభుత్వం కొత్తగా బియ్యం కార్డులు జారీ చేస్తోంది. వీటిని జనవరిలో అందచేయనున్నట్లుగా అధికారులు ప్రకటించారు. అయితే, కొత్తగా అందజేయనున్న బియ్యంకార్డులకు కావాల్సిన అర్హతలు గమనిస్తే..మూడెకరాల మాగాణి లేదా 10 ఎకరాల్లోపు మెట్ట ఉన్నవారికి, లేదా రెండూ కలిపి పదెకరాల్లోపు ఉన్న వారు కొత్త బియ్యంకార్డులకు అర్హులుగా గుర్తిస్తున్నారు. ఇకపోతే, 300 యూనిట్ల వరకు విద్యుత్‌ వినియోగదారులు సైతం కొత్తకార్డులకు అర్హులుగా గుర్తించారు. ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్లు వంటి నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు కూడా ప్రభుత్వం బియ్యంకార్డులను అందజేయనుంది. ఇక కొత్తకార్డుల ప్రింటింగ్‌ కోసం నాలుగు రోజుల్లో టెండర్లు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లుగా సమాచారం. ఈ మేరకు అన్ని అర్హతలు ఉండి, జాబితాలో పేరు లేని వారు మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించారు.