మందడంలో నాగబాబు.. ఎంత మాట అనేశారు!
ఏపీ రాజధాని అంశంపై ఉద్యమిస్తున్న అమరావతి ప్రాంత రైతులకు ప్రతిపక్షాల అండగా నిలుస్తున్నాయి. అమరావతి ఏరియాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకు శ్రీకారం చుట్టిన రైతాంగాన్ని విపక్ష టీడీపీ, జనసేన పార్టీల నేతలు కలిసి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం జనసేన పార్టీలో కీలక నేతలు నాగబాబు, నాదెండ్ల మనోహర్ మందడం ఏరియాలో పర్యటించారు. ఉద్యమించిన రైతాంగానికి మద్దతు ప్రకటించారు. అయితే.. పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఈ సందర్భంగా చేసిన కామెంట్లు పొలిటికల్ రప్చర్‌ను మరింత […]
ఏపీ రాజధాని అంశంపై ఉద్యమిస్తున్న అమరావతి ప్రాంత రైతులకు ప్రతిపక్షాల అండగా నిలుస్తున్నాయి. అమరావతి ఏరియాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకు శ్రీకారం చుట్టిన రైతాంగాన్ని విపక్ష టీడీపీ, జనసేన పార్టీల నేతలు కలిసి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం జనసేన పార్టీలో కీలక నేతలు నాగబాబు, నాదెండ్ల మనోహర్ మందడం ఏరియాలో పర్యటించారు. ఉద్యమించిన రైతాంగానికి మద్దతు ప్రకటించారు. అయితే.. పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఈ సందర్భంగా చేసిన కామెంట్లు పొలిటికల్ రప్చర్‌ను మరింత పెంచుతున్నాయి. అదే సమయంలో జనసేన పార్టీకి బిజెపికి లోపాయికారీ అవగాహనను మరోసారి పరోక్షంగా వెల్లడించేశారు జనసేన నేతలు.
అసెంబ్లీ ఆఖరు రోజు ఉన్నట్లుండి ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన అమరావతి ఏరియా రైతుల్లో ఆందోళనకు కారణమైంది. వరుస ఆందోళన కార్యక్రమాలతో ప్రభుత్వ ఆలోచనా ధోరణిని మార్చేందుకు రైతులు ఒత్తిడి తెస్తున్నారు. దాంట్లో భాగంగా మందడం, ఉద్దండరాయుని పాలెం ప్రాంతాల్లో రైతులు ధర్నాలు, వంటావార్పులు వంటి కార్యక్రమాలతో ఉద్యమించారు. ఈ రైతులను శుక్రవారం నాడు జనసేన నేతలు నాగబాబు, మనోహర్ కలిసి సంఘీభావం ప్రకటించారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
రాజధాని మార్పు మంచిది కాదని అభిప్రాయపడిన నాగబాబు, మనోహర్ ఈ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసి వివరిస్తామని చెప్పారు నాగబాబు. రాజధాని విషయంలో గందరగోళం ఏర్పడితే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని నాగబాబు ప్రశ్నించారు. జగన్ పూర్తిగా అవగాహన లేకుండా పరిపాలన చేస్తున్నారని విమర్శించారాయన. రెండు కమిటీలను నియమించిన ముఖ్యమంత్రి వాటి రిపోర్డులు రాకుండానే ఎలా ప్రకటన చేస్తారని సీఎంను నిలదీశారు.
రాజధాని విషయంలో ఘాటైన వ్యాఖ్యలు చేసిన జనసేన నేతలు ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తామని చెప్పడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర రాజధాని ఎక్కడ పెట్టుకోవాలనేది పూర్తిగా స్టేట్ సబ్జెక్టని దానికి ప్రధానితో సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. ప్రధాని కలుస్తామని చెప్పడం ద్వారా జనసేనకు, బిజెపికి వున్న అక్రమ సంబంధం బయటపడిందని వ్యాఖ్యానిస్తున్నారు వైసీపీ వర్గాలు.