హైకోర్టు షిఫ్టింగ్ అంత వీజీకాదు.. రీజన్ ఇదే!

ఏపీ ముఖ్యమంత్రి చెప్పిన మూడు రాజధానుల ఫార్ములాలో రెండు ఓకే గానీ.. రాష్ట్ర హైకోర్టును తరలించడం సుప్రీంకోర్టు అంగీకారం లేకుండా సాధ్యమా ? ఈ ప్రశ్నను పలువురు న్యాయవాదులు లేవనెత్తుతున్నారు. ఇందుకు గతంలో మద్రాస్ హైకోర్టు అంశాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. హైకోర్టు తరలింపు సుప్రీంకోర్టు పరిధిలోని అంశమని మరికొందరు చెబుతున్నారు. దాంతో హైకోర్టు తరలింపు అంశంపై చర్చ హీటెక్కుతోంది. అమరావతిని లిజిస్లేచర్ రాజధానిగా కొనసాగిస్తూ.. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగాను, కర్నూలును జ్యూడిషియరీ రాజధానిగాను చేసే అవకాశముందని ముఖ్యమంత్రి […]

హైకోర్టు షిఫ్టింగ్ అంత వీజీకాదు.. రీజన్ ఇదే!
Follow us

|

Updated on: Dec 20, 2019 | 1:55 PM

ఏపీ ముఖ్యమంత్రి చెప్పిన మూడు రాజధానుల ఫార్ములాలో రెండు ఓకే గానీ.. రాష్ట్ర హైకోర్టును తరలించడం సుప్రీంకోర్టు అంగీకారం లేకుండా సాధ్యమా ? ఈ ప్రశ్నను పలువురు న్యాయవాదులు లేవనెత్తుతున్నారు. ఇందుకు గతంలో మద్రాస్ హైకోర్టు అంశాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. హైకోర్టు తరలింపు సుప్రీంకోర్టు పరిధిలోని అంశమని మరికొందరు చెబుతున్నారు. దాంతో హైకోర్టు తరలింపు అంశంపై చర్చ హీటెక్కుతోంది.

అమరావతిని లిజిస్లేచర్ రాజధానిగా కొనసాగిస్తూ.. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగాను, కర్నూలును జ్యూడిషియరీ రాజధానిగాను చేసే అవకాశముందని ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు తరలింపుపై పలు వాదనలు తెరమీదికి వచ్చాయి. హైదరాబాద్‌లో వున్న ఉమ్మడి హైకోర్టును విభజించే సమయంలో సుప్రీం కోర్టు కొలీజియం ఏపీ ప్రభుత్వాన్ని అభిప్రాయం కోరింది. ఎక్కడ హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అనుకుంటుందని క్లియర్ కట్‌గా కనుగొన్న తర్వాతనే విభజనకు ఆమోదం తెలిపింది. అప్పట్లో చంద్రబాబు అమరావతిలోనే హైకోర్టు ఏర్పాటు చేసేందుకు సిద్దపడ్డారు. ఈ మేరకు లిఖిత పూర్వకంగా సుప్రీంకోర్టు కొలీజియంకు లేఖ కూడా ఇచ్చారు.

తాజాగా కర్నూలుకు హైకోర్టును తరలించాలంటే మళ్ళీ సుప్రీంకోర్టు అనుమతి కంపల్సరీ అన్న వాదనను కొందరు తెరమీదికి తెస్తున్నారు. ఆల్‌రెడీ ఎస్టాబ్లిష్ అయిన హైకోర్టును ఇంకో చోటికి తరలించాలంటే సుప్రీంకోర్టు అనుమతి, ఆమోదం కంపల్సరీ అంటున్నారు కొందరు న్యాయవాదులు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తరలింపును అంత ఈజీగా అంగీకరించదని, దానికి సహేతుకమైన కారణాలు చూపించాల్సి వుంటుందని చెబుతున్నారు. గతంలో మద్రాస్ హైకోర్టులో కొన్ని విభాగాలను చెన్నై శివారుల్లో నిర్మించే కొత్త భవనాలకు తరలించాలన్న ప్రతిపాదన ముందుకొస్తే సుప్రీంకోర్టు తిరస్కరించిందని మరికొందరు గుర్తు చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే హైకోర్టు బెంచ్‌లను రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు కానీ.. హైకోర్టు అడ్మినిస్ట్రేషన్ సహా మొత్తం తరలించాలంటే మాత్రం సుప్రీంకోర్టు ఆమోదం తప్పనిసరి అంటున్నారు. మరి ఇదంతా తెలియకుండానే జగన్ ప్రకటన చేశారా అంటే అవునని అనుకోలేం. సో.. కర్నూలు వాస్తవ్యులు కోరుకుంటున్నట్లు హైకోర్టు తమ నగరానికి రావాలంటే అసాధ్యమేమీ కాకపోవచ్చు కానీ.. అన్ని అనుమతులు, ఆమోదాలు పొందేందుకు చాలా సమయం పట్టొచ్చు అనే అభిప్రాయం వినిపిస్తోంది.