ఏపీ విత్తనాలను తెలంగాణకు తరలిస్తున్నారు: నారా లోకేష్ విమర్శలు

ఏపీ రైతులకు ఇవ్వాల్సిన విత్తనాలను తెలంగాణకు ఇస్తున్నారని.. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. శాసనమండలిలో మాట్లాడిన నారా లోకేష్.. సీఎం జగన్ ప్రతి విషయంలోనూ మాట తప్పుతున్నారు.. మడమ తిప్పుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితి, అప్పుల విషయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శ్వేతపత్రంలో ఒకలా, బడ్జెట్‌లో మరోలా చెప్పారని.. రాష్ట్ర ప్రజలు దేన్ని నమ్మాలని ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన జగన్.. […]

ఏపీ విత్తనాలను తెలంగాణకు తరలిస్తున్నారు: నారా లోకేష్ విమర్శలు
Follow us

| Edited By:

Updated on: Jul 15, 2019 | 4:04 PM

ఏపీ రైతులకు ఇవ్వాల్సిన విత్తనాలను తెలంగాణకు ఇస్తున్నారని.. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. శాసనమండలిలో మాట్లాడిన నారా లోకేష్.. సీఎం జగన్ ప్రతి విషయంలోనూ మాట తప్పుతున్నారు.. మడమ తిప్పుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితి, అప్పుల విషయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శ్వేతపత్రంలో ఒకలా, బడ్జెట్‌లో మరోలా చెప్పారని.. రాష్ట్ర ప్రజలు దేన్ని నమ్మాలని ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన జగన్.. ప్రధాని మోదీకి పాదాభివందనం చేస్తున్నారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

రైతులకు విత్తనాలు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని.. వాళ్లను క్యూలైన్లోల నిల్చోబెట్టి చంపేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న 1500మంది రైతులకు రూ.7లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం.. వైఎస్ హయాంలో ఆత్మహత్య చేసుకున్న 15వేల మంది రైతులను మర్చిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 80లక్షల మంది విద్యార్థులుంటే కేవలం 40లక్షల మందికే అమ్మఒడి పథకం వర్తింపజేస్తున్నారని.. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులకూ కోత పెట్టారని లోకేష్ విమర్శించారు.