AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు దంపతులకు శుభాకాంక్షల వెల్లువ

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దంపతుల పెళ్లి రోజు ఇవాళ. 1981 సెప్టెంబర్ 10న చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అప్పట్లో కాంగ్రెస్ నేతగా ఉన్న చంద్రబాబు..

చంద్రబాబు దంపతులకు శుభాకాంక్షల వెల్లువ
Anil kumar poka
|

Updated on: Sep 10, 2020 | 2:05 PM

Share

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దంపతుల పెళ్లి రోజు ఇవాళ. 1981 సెప్టెంబర్ 10న చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అప్పట్లో కాంగ్రెస్ నేతగా ఉన్న చంద్రబాబు.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దిగ్గజ తెలుగు సినీ నటుడు ఎన్టీఆర్ కుమార్తె అయిన భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. అనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీలో ఉన్నత స్థానాలకు చేరుకున్న బాబు.. మామ ఎన్టీఆర్ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని తీసుకున్నారు. ప్రస్తుతం టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘అమ్మానాన్నలకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు! ప్రజల కోసం ఒకరు, కుటుంబం కోసం మరొకరు శ్రమిస్తూనే… ఒకరి ఆశయాలకు మరొకరు అండగా నిలిచి, ఆదర్శ దంపతులకు అసలైన నిర్వచనమయ్యారు మీరు. మీరిలాగే ఆదిదంపతుల్లా కలకాలం మా కళ్ళకు పండుగగా నిలవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను’. అని పేర్కొన్నారు. అటు, తెలుగుదేశం పార్టీ నేతలు తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Follow Us
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఈ రూట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఈ రూట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..
కూరగాయల్లో కంటికి కనిపించని పురుగులు,వండే ముందు ఇలా క్లీన్ చేయండి
కూరగాయల్లో కంటికి కనిపించని పురుగులు,వండే ముందు ఇలా క్లీన్ చేయండి
ముంబై ఇండియన్స్‌కు సూర్య గుడ్ బై?
ముంబై ఇండియన్స్‌కు సూర్య గుడ్ బై?
3 నెలల ముందు తెలిస్తే ఆ సినిమాలో భాగమయ్యేవాడిని.. కమల్ హాసన్..
3 నెలల ముందు తెలిస్తే ఆ సినిమాలో భాగమయ్యేవాడిని.. కమల్ హాసన్..
మృగశిర రోజు అక్కడికి వెళ్తే.. మీకు నచ్చిన నాన్ వంటకం కుమ్మెయొచ్చు
మృగశిర రోజు అక్కడికి వెళ్తే.. మీకు నచ్చిన నాన్ వంటకం కుమ్మెయొచ్చు
సినిమా ఆఫర్స్ లేనప్పుడు అన్నం పెట్టింది వాళ్లే.. హీరో అబ్బాస్
సినిమా ఆఫర్స్ లేనప్పుడు అన్నం పెట్టింది వాళ్లే.. హీరో అబ్బాస్
మధుమేహం వల్ల వచ్చే ఇతర ఆరోగ్య ప్రమాదాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే
మధుమేహం వల్ల వచ్చే ఇతర ఆరోగ్య ప్రమాదాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే
ఆటో ఎక్కిన మహిళతో డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. వినలేని మాటలతో..
ఆటో ఎక్కిన మహిళతో డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. వినలేని మాటలతో..
క్యాబ్ డ్రైవర్ పై సినీ నటుడు దాడి..
క్యాబ్ డ్రైవర్ పై సినీ నటుడు దాడి..
ఇదే మంచి ఛాన్స్.. జస్ట్‌ 4 గంటల్లోనే భారీగా తగ్గిన బంగారం ధరలు
ఇదే మంచి ఛాన్స్.. జస్ట్‌ 4 గంటల్లోనే భారీగా తగ్గిన బంగారం ధరలు