రుజువుచేస్తే రాజీనామా : ఏపీ మంత్రి జయరాం

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి సవాల్ విసిరారు ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం. తన పైన, తన కుమారుడిపైనా అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు.

రుజువుచేస్తే రాజీనామా : ఏపీ మంత్రి జయరాం
Follow us
Anil kumar poka

|

Updated on: Sep 18, 2020 | 4:50 PM

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి సవాల్ విసిరారు ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం. తన పైన, తన కుమారుడిపైనా అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. తాను మంత్రినని.. తనను.. తన కుటుంబ సభ్యులను  కలిసేందుకు ఎందరో వస్తారని ఆయన చెప్పారు. అలా కలిసేందుకు వచ్చిన వారు వివిధ కేసుల్లో ఉండవచ్చని.. అలా ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తీక్ అనే యువకుడు నా కుమారుడు ఈశ్వర్ ను కలిసి ఉండవచ్చు.. బెంజు కారు దగ్గర ఫోటోలు దిగి ఉండవచ్చని మంత్రి తెలిపారు.

నా కుమారుడు విమానం.. హెలికాప్టర్ దగ్గర ఫోటోలు దిగితే అవి నా కుమారుడివి అవుతాయా అని జయరాం ప్రశ్నలు సంధించారు. బెంజు కారు తన కుమారుడుకి ఓ కేసులో ఉన్న వ్యక్తి కొనుగోలు చేసి ఇచ్చినట్లు అయ్యన్నపాత్రుడు మతి భ్రమించి తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కారు తన కుమారుడి పేరు మీద ఉన్నట్లు నిరూపించాలని మంత్రి డిమాండ్ చేశారు.