టీడీపీ అర్బన్ కార్యాలయం తరలింపు.. కేశినేని సంచలన ట్వీట్

విజయవాడలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అర్బన్ కార్యాలయాన్నికేశినేని భవన్ నుంచి ఆటోనగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలోకి తరలిస్తూ టీడీపీ పార్టీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ ఎంపీ కేశినేని ఎంపీ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా స్పందించారు. ‘‘తక్కువ లగేజీ ఉంటే సుఖంగా ఉంటుంది’’ అని ట్వీట్ చేసిన కేశినేని.. ఈ మేరకు టీడీపీ పార్టీ ప్రకటనను కూడా జత చేశారు. కాగా ఇప్పటివరకు పార్టీ అర్బన్ కార్యాలయం కేశినేని భవనంలోనే […]

టీడీపీ అర్బన్ కార్యాలయం తరలింపు.. కేశినేని సంచలన ట్వీట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 12, 2019 | 8:01 PM

విజయవాడలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అర్బన్ కార్యాలయాన్నికేశినేని భవన్ నుంచి ఆటోనగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలోకి తరలిస్తూ టీడీపీ పార్టీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ ఎంపీ కేశినేని ఎంపీ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా స్పందించారు. ‘‘తక్కువ లగేజీ ఉంటే సుఖంగా ఉంటుంది’’ అని ట్వీట్ చేసిన కేశినేని.. ఈ మేరకు టీడీపీ పార్టీ ప్రకటనను కూడా జత చేశారు.

కాగా ఇప్పటివరకు పార్టీ అర్బన్ కార్యాలయం కేశినేని భవనంలోనే కొనసాగుతుండేవి. అయితే ఇప్పుడు కార్యాలయం మార్పుతో.. అర్బన్ తెలుగుదేశం పార్టీ సొంత కార్యాలయం ఏర్పాటు అయ్యేవరకు ఆ కార్యక్రమాలు, సమావేశాలు జిల్లా పార్టీ కార్యాలయంలో జరుగుతాయి. కాగా గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు, కేశినేని నాని మధ్య కోల్డ్ వార్ జరుగుతోన్న విషయం తెలిసిందే.

https://twitter.com/kesineni_nani/status/1160899571637051398/photo/1?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1160899571637051398&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Fnews%2Fpolitics%2Fbonda-uma-met-chandrababu-amaravathi-1215134