సీఎం జగన్​ అమెరికా పర్యటన షెడ్యూల్ ఫిక్స్!

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నెల 15న కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత… అదేరోజు హైదరాబాద్‌ లోటస్ పాండ్​లోని నివాసానికి చేరుకుంటారు. రాత్రికి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి అమెరికాకు బయలుదేరతారు. సీఎం చిన్న కుమార్తె వర్షారెడ్డిని అమెరికాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్‌ కోర్సులో చేర్పించేందుకు వెళుతున్నారని సమాచారం. ఆగస్టు17న డల్లాస్‌లోని ‘కే బెయిలీ హచిసెన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌’లో ఉత్తర అమెరికాలోని తెలుగు […]

సీఎం జగన్​ అమెరికా పర్యటన షెడ్యూల్ ఫిక్స్!
CM Jagan
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 12, 2019 | 8:57 PM

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నెల 15న కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత… అదేరోజు హైదరాబాద్‌ లోటస్ పాండ్​లోని నివాసానికి చేరుకుంటారు. రాత్రికి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి అమెరికాకు బయలుదేరతారు. సీఎం చిన్న కుమార్తె వర్షారెడ్డిని అమెరికాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్‌ కోర్సులో చేర్పించేందుకు వెళుతున్నారని సమాచారం. ఆగస్టు17న డల్లాస్‌లోని ‘కే బెయిలీ హచిసెన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌’లో ఉత్తర అమెరికాలోని తెలుగు ప్రజలతో జరిగే ఆత్మీయ సమావేశంలో సీఎం జగన్‌ పాల్గొననున్నారు. 8 రోజుల పర్యటన అనంతరం ఈనెల 24న గుంటూరు జిల్లా తాడేపల్లికి తిరిగి వస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి.