ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను
తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయనని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేసిన కార్యాలయంలో సీనియర్ జర్నలిస్ట్ కె.రామచంద్రమూర్తి తన పాదయాత్రపై రాసిన జయహో పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిక్షణం ప్రజల కోసమే ఆలోచిస్తూ వారి సంక్షేమం దిశగా పాలన సాగిస్తున్నామని.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పాదయాత్రలో తనకు […]
తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయనని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేసిన కార్యాలయంలో సీనియర్ జర్నలిస్ట్ కె.రామచంద్రమూర్తి తన పాదయాత్రపై రాసిన జయహో పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిక్షణం ప్రజల కోసమే ఆలోచిస్తూ వారి సంక్షేమం దిశగా పాలన సాగిస్తున్నామని.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ప్రయత్నిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా పాదయాత్రలో తనకు ఎదురైన అనుభవాలను జగన్ గుర్తుచేసుకున్నారు. 3వేల కిలోమీటర్ల పాదయాత్రను తలచుకుంటే ఉత్తేజం కలుగుతుందని.. ఆ పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకున్నానని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రజల నమ్మకం నిలబెట్టేలా సుపరిపాలన అందిస్తామని భరోసా ఇచ్చారు.