జగన్‌ది రైతు వ్యతిరేక రాజ్యం- చంద్రబాబు
అమరావతి: ఏపీలో రాజన్న రాజ్యం తెస్తామని చెప్పిన సీఎం జగన్ రైతు వ్యతిరేక రాజ్యం తెచ్చారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. రైతులకు విత్తనాలు కూడా ఇవ్వలేని వైసీపీ ప్రభుత్వం రైతు దినోత్సవం జరపడం హాస్యాస్పదమన్నారు. విత్తనాలు అడిగితే లాఠీ దెబ్బలు, పోలీస్ స్టేషన్లలో విత్తనాల పంపిణీ లాంటి నిర్వాకాలతో రైతులను వేధిస్తున్నారని ఆరోపించారు. పోలవరం పనులపై దుష్ప్రచారం చేయడం రైతాంగ వ్యతిరేకమేనన్నారు. టీడీపీ ప్రభుత్వం […]
అమరావతి: ఏపీలో రాజన్న రాజ్యం తెస్తామని చెప్పిన సీఎం జగన్ రైతు వ్యతిరేక రాజ్యం తెచ్చారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. రైతులకు విత్తనాలు కూడా ఇవ్వలేని వైసీపీ ప్రభుత్వం రైతు దినోత్సవం జరపడం హాస్యాస్పదమన్నారు. విత్తనాలు అడిగితే లాఠీ దెబ్బలు, పోలీస్ స్టేషన్లలో విత్తనాల పంపిణీ లాంటి నిర్వాకాలతో రైతులను వేధిస్తున్నారని ఆరోపించారు. పోలవరం పనులపై దుష్ప్రచారం చేయడం రైతాంగ వ్యతిరేకమేనన్నారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను రద్దు చేయడం రాష్ట్ర రైతాంగానికే నష్టదాయకమని విమర్శించారు.