ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడంటే?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్నాయి. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 12న ఉదయం 11 గంటలకు సభలో వైసీపీ ప్రభుత్వ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను కూడా సభ ముందుకు తేనున్నారు. ఈ క్రమంలో రేపు అన్ని శాఖల అధికారులతో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం భేటీ కానున్నారు. సమావేశాలకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించనున్నారు. వైఎస్ జగన్ మోహన్ […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్నాయి. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 12న ఉదయం 11 గంటలకు సభలో వైసీపీ ప్రభుత్వ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను కూడా సభ ముందుకు తేనున్నారు. ఈ క్రమంలో రేపు అన్ని శాఖల అధికారులతో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం భేటీ కానున్నారు. సమావేశాలకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించనున్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్ కావడంతో … ఆయన బడ్జెట్‌లో దేనికి పెద్దపీట వేస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొన్ని రోజుల క్రితమే జగన్ మోహన్ రెడ్డి బడ్జెట్‌కు తుదిమెరుగులు దిద్దారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాము పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడతామని జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించారు. దీంతో బడ్జెట్‌లో జగన్ వేటికి ప్రాధాన్యం ఇస్తారనే చర్చ ప్రజల్లో నడుస్తోంది.