ఏపీ ఎంసెట్ ‘వెబ్ ఆప్షన్ల’ ప్రక్రియ మళ్లీ వాయిదా!

ఏపీలో జులై 8 నుంచి ప్రారంభం కావాల్సిన ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. జులై 12 తర్వాత వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియను కూడా జులై 11 వరకు పొడిగించినట్లు వెల్లడించారు. కొంతమంది విద్యార్థుల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ మార్కుల వివరాలు ఆలస్యంగా అందడంతో.. వారికి ర్యాంకులు ప్రకటించడంలో ఆలస్యం కావడంతో ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేసినట్లు తెలిపారు. ఇంజినీరింగ్ ఫీజులను […]

ఏపీ ఎంసెట్ 'వెబ్ ఆప్షన్ల' ప్రక్రియ మళ్లీ వాయిదా!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 08, 2019 | 3:58 PM

ఏపీలో జులై 8 నుంచి ప్రారంభం కావాల్సిన ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. జులై 12 తర్వాత వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియను కూడా జులై 11 వరకు పొడిగించినట్లు వెల్లడించారు. కొంతమంది విద్యార్థుల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ మార్కుల వివరాలు ఆలస్యంగా అందడంతో.. వారికి ర్యాంకులు ప్రకటించడంలో ఆలస్యం కావడంతో ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేసినట్లు తెలిపారు. ఇంజినీరింగ్ ఫీజులను ప్రభుత్వం ఇప్పటి వరకు ఖరారు చేయకపోవడంతో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్సీ) ఫీజులను సిఫార్సు చేసింది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. జులై 12 లోగా దీనిపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు ఎంసెట్ కమిటీ భావిస్తోంది. ఆ తర్వాతే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమ‌వుతుంది.