AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ మంత్రులకు జగన్ క్లాస్..ఎవరు వారు.. ఎందుకు..?

ఏపీ సీఎం జగన్ తన పాలనను ఎలా సాగిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిధుల కొరత ఉన్నా..కేంద్రం నుంచి సాయం పెద్దగా అందకున్నా..వైఎస్ జగన్ మాత్రం సంక్షేమ పథకాల అమలు విషయంలో వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు గ్రామ వాలంటీర్, రివర్స్ టెండరింగ్, పీపీఏల రద్దు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం లాంటి ప్రతిపాదనలతో దేశంలోని ఓ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారారు.  ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయింది. ఈ ఐదు నెలల కాలంలో […]

ఆ మంత్రులకు జగన్ క్లాస్..ఎవరు వారు.. ఎందుకు..?
Ram Naramaneni
|

Updated on: Oct 31, 2019 | 4:50 AM

Share

ఏపీ సీఎం జగన్ తన పాలనను ఎలా సాగిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిధుల కొరత ఉన్నా..కేంద్రం నుంచి సాయం పెద్దగా అందకున్నా..వైఎస్ జగన్ మాత్రం సంక్షేమ పథకాల అమలు విషయంలో వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు గ్రామ వాలంటీర్, రివర్స్ టెండరింగ్, పీపీఏల రద్దు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం లాంటి ప్రతిపాదనలతో దేశంలోని ఓ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారారు.  ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయింది. ఈ ఐదు నెలల కాలంలో జగన్…పలుమార్లు మంత్రివర్గ సమావేశాలు ఏర్పాటు చేసి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రతి మంత్రివర్గ సమావేశంలో కొత్త పథకాలకు జగన్ ఆమోద ముద్రవేస్తున్నారు. అయితే ఓ వైపు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటూనే జగన్ మంత్రులకు క్లాస్ కూడా తీసుకుంటున్నారు. వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవినీతి మరకలు లేవంటూనే..విధుల్లో అలసత్వం వహించేవారి తలంటుతున్నారు. కరప్షన్ ఎలిగేషన్స్ వచ్చినవారికి పర్సనల్‌ పిలిచి పద్దతి మార్చుకోమని చెబుతున్నారు.  మొదట్లో జరిగిన కేబినెట్ మీటింగ్‌లో తప్ప…ఇటీవల వరుసగా జరిగిన మూడు సమావేశాల్లో జగన్ మంత్రులకు క్లాస్ తీసుకోవడం కామన్ అయిపోయింది.

కాగా ఈ బుధవారం ఏపీ కేబినెట్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కూడా జగన్ మంత్రులపై ఫైర్ అయినట్లు సమాచారం.  చాలామంది సచివాలయంలో అందుబాటులో ఉండటం లేదంటూ జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక నుంచి ప్రతి మంగళవారం, బుధవారాల్లో మంత్రులు కచ్చితంగా సచివాలయంలో ఉండాలని ఆయన ఆదేశించారట. ఎక్కువమంది మంత్రులు ఎక్కువగా జిల్లాల్లోనే ఉంటున్నారని, అమరావతికి అప్పుడప్పుడూ వచ్చి వెళుతున్నారన్న సమాచారంతో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర – రాయలసీమకు చెందిన కొందరు మంత్రులు ఎక్కువగా సచివాలయానికి రాకపోవడంపై ముఖ్యమంత్రి జగన్ వారి పేర్లు ప్రస్తావించి మరీ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.  ఎవరెవరు అయితే సచివాలయానికి చాలా తక్కువుగా వస్తున్నారో నివేదిక తెప్పించుకున్న జగన్ వారికి క్లియర్‌కట్ సూచనలు చేశారట. ఇకపై ప్రతి కేబినెట్ మీటింగ్ కు మంత్రులు తమ శాఖలపై తరూగా అధ్యయనం చేసి మరీ రావాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది. మరి మంత్రివర్యులు ఇప్పటికైనా పద్దతి మార్చుకుంటారో, లేదో చూడాలి.