పులివెందులకు సీఎం జగన్ వరాలు..మారనున్న రూపురేఖలు

పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తన సొంత నియోజకవర్గంకు సీఎం వరాలు ప్రకటించారు. వైసీసీ అఖండ మెజార్టీతో గెలిచిన కొత్తలో రెండురోజులు పులివెందులలో ప్రజాదర్బార్ నిర్విహించిన జగన్ ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాజాగా పులివెందులలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటుకు సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం ప్రకటించిన అభివృద్ది పనులు, మౌళిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలతో […]

పులివెందులకు సీఎం జగన్ వరాలు..మారనున్న రూపురేఖలు
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 31, 2019 | 6:06 AM

పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తన సొంత నియోజకవర్గంకు సీఎం వరాలు ప్రకటించారు. వైసీసీ అఖండ మెజార్టీతో గెలిచిన కొత్తలో రెండురోజులు పులివెందులలో ప్రజాదర్బార్ నిర్విహించిన జగన్ ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాజాగా పులివెందులలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటుకు సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం ప్రకటించిన అభివృద్ది పనులు, మౌళిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలతో పులివెందుల రూపురేఖలే మారిపోనున్నాయి. గతంలో ఆయన చెప్పినట్టుగానే పులివెందుల ఓ మోడల్ నియోజకవర్గంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సమీక్షలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు: 

  1. వేముల మండలం నల్లచెరువుపల్లిలో 132 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు
  2. పులివెందుల నియోజకవర్గంలో 11 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, పులివెందుల ఏరియా ఆసుపత్రికి, వేంపల్లి సిహెచ్‌సీకి 30 కోట్లతో మౌలిక సౌకర్యాల కల్పన
  3. పులివెందుల మున్సిపాలిటీ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఎస్టీపీకి రూ. 50 కోట్లతో డీపీఆర్‌ సిద్ధం చేయాలని ఆదేశం
  4. పులివెందులలో రూ. 17.65 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం కోసం డీపీఆర్‌ సిద్దం చేయాలని ఆదేశం
  5. జేఎన్‌టీయూ కొత్త లెక్చరర్‌ కాంప్లెక్స్‌, నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి రూ. 10 కోట్ల నిధులు మంజూరు
  6. పులివెందుల మార్కెట్‌యార్డ్‌లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ. 5 కోట్లు మంజూరు
  7.  సింహాద్రిపురం, వేంపల్లి పాలిటెక్నిక్‌ కాలేజ్‌లకు రూ. 15 కోట్లతో మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయం
  8. పులివెందుల నియోజకవర్గంలో కొత్తగా 7 గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజ్‌ ఏర్పాటు సన్నాహాలు
  9. పులివెందుల శిల్పారామానికి సుమారు రూ. 10 కోట్లతో అభివృద్ది ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశాలు
  10. వేంపల్లిలో మిని శిల్పారామం ఏర్పాటకు భూమి గుర్తింపు, నిర్మాణ ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశాలు