జగన్ స్వీట్ వార్నింగ్… చిరునవ్వే మీ చిరునామా!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సును నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సదస్సులో సీఎం జగన్ కలెక్టర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. వివిధ పనులపై తమ వద్దకు వచ్చే ప్రజా ప్రతినిధులతో గానీ, ప్రజలతో గానీ కలెక్టర్లు చిరునవ్వుతో పలకరించాలని ఆయన సూచించారు. అవినీతి, దోపిడీ తమ ప్రభుత్వం సహించదని.. లంచాలు ఇస్తేనే గానీ పనులు జరగదనే పరిస్థితి మారాలని కలెక్టర్లను సూచించారు. పేద ప్రజలు, వెనకబడ్డ, షెడ్యూల్ వర్గాలకు […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సును నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సదస్సులో సీఎం జగన్ కలెక్టర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. వివిధ పనులపై తమ వద్దకు వచ్చే ప్రజా ప్రతినిధులతో గానీ, ప్రజలతో గానీ కలెక్టర్లు చిరునవ్వుతో పలకరించాలని ఆయన సూచించారు. అవినీతి, దోపిడీ తమ ప్రభుత్వం సహించదని.. లంచాలు ఇస్తేనే గానీ పనులు జరగదనే పరిస్థితి మారాలని కలెక్టర్లను సూచించారు. పేద ప్రజలు, వెనకబడ్డ, షెడ్యూల్ వర్గాలకు ప్రభుత్వ పధకాలు వేగంగా అందించేందుకు కృషి చేయాలన్నారు. వైసీపీ నేతలతో పాటు ఎవరు, ఎంత అవినీతికి పాల్పడినా అడ్డుకోవాలని, అందరికీ ఒకే రూల్ ఉంటుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.