బాబు ఇంటి చుట్టూ వరద రాజకీయం
అమరావతిలో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. ముంపు ప్రాంతాల వాసులు భయంతో వణికిపోతున్నారు. వరద ఉధృతి పెరగడంతో.. ముప్పును ఎదర్కొక తప్పదనే భయంతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటికే నీళ్లను వదులుతున్నారు. దీంతో దివిసీమాలో గంటగంటకు వరద ఉదృతి పెరుగుతోంది. పులిగడ్డ అక్విడేట్ వద్ద ఇప్పటికే వరద నీరు 18 అడుగులకు చేరుకుంది. పరిస్థతి ప్రమాదకరంగా మారడంతో అక్విడెక్ట్ పై రాకపోకలను అధికారులు నిలిపేశారు. ఇప్పటికే అధికారులు లోతట్టు ప్రాంతాల వారిని […]
అమరావతిలో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. ముంపు ప్రాంతాల వాసులు భయంతో వణికిపోతున్నారు. వరద ఉధృతి పెరగడంతో.. ముప్పును ఎదర్కొక తప్పదనే భయంతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటికే నీళ్లను వదులుతున్నారు. దీంతో దివిసీమాలో గంటగంటకు వరద ఉదృతి పెరుగుతోంది. పులిగడ్డ అక్విడేట్ వద్ద ఇప్పటికే వరద నీరు 18 అడుగులకు చేరుకుంది. పరిస్థతి ప్రమాదకరంగా మారడంతో అక్విడెక్ట్ పై రాకపోకలను అధికారులు నిలిపేశారు. ఇప్పటికే అధికారులు లోతట్టు ప్రాంతాల వారిని అలెర్ట్ చేశారు. కృష్ణా నదిలో మరింత వరద పెరగుతోంది. పదేళ్ల తర్వాత కృష్ణా నదిలో వరద ఉధృతి కనిపిస్తుండటంతో నీళ్లను చూడటానికి జనం భారీ ఎత్తున తరలి వస్తున్నారు.
ఇదిలా వుంటే.. కరకట్టను కృషానీరు తాకింది. కరకట్ట సమీపంలోని ఇళ్లు, పంటపొలాలు, అరటి తోటల్లోకి వరద నీరు చేరింది. దీంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. కరకట్ట వద్ద చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ఇంటి మెట్ల దగ్గరకు వరద నీరు చేసింది. గుంటూరు కలెక్టర్ చంద్రబాబు గెస్ట్ హౌస్‌ను పరిశీలించారు. వరద ఉధృతిని రెవెన్యూ అధికారులతో కలిసి అంచనా వేశారు. మరోవైపు వరద ఉధృతి కారణంగా అమరావతి, క్రోసూరు, అచ్చంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
మరోవైపు కృష్ణావరదపై మాజీ మంత్రి దేవినేని ఉమ సంచలన కామెంట్లు చేశారు. ఇది ప్రభుత్వం కావాలని సృష్టించిన వరద అని.. ఒక ప్రణాళిక లేకుండా నీటి విడుదల చేయడం వలనే వరద ఉధృతి ఈ స్థాయిలో పెరిగిందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నివాసం, రాజధాని రైతుల భూములను ముంచాలనే ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తోందని ఆయన ఆరోపించారు. రాజధాని కడపకు తరలించుకుపోవాలని సీఎం జగన్ కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. గతంలో 11 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినప్పుడే ఎలాంటి నష్టం జరగలేదని.. ఇప్పుడు 7 లక్షల క్యూసెక్కులకే విజయవాడ పరిసర ప్రాంతాలను ముంచేసిందని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి కృష్ణానది వరద ప్రభావం రాజకీయ నేతలపై పడింది.