సినీ పెద్దల పై పృధ్వీరాజ్ ఫైర్.. అసలు విషయం తెలిస్తే..?
ఏపీ సీఎం జగన్ పట్ల సినీ పరిశ్రమ ఎందుకు వివక్ష చూపిస్తోందని పృధ్వీరాజ్ ప్రశ్నించారు. తాజాగా సినీనటులు రాజేంద్రప్రసాద్ జగన్ పై చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. జగన్ సీఎం అయితే కలవాలా, సినిమా వాళ్ళు వ్యాపారస్తులా అని రాజేంద్రప్రసాద్ వ్యంగ్యంగా మాట్లాడడంలో ఎలాంటి అర్థం ఉందో చూడాలన్నారు. గతంలో చంద్రబాబును కలిసినప్పుడు ఇదంతా గుర్తులేదా అని ప్రశ్నించారు. సీఎంని కలిసే వాళ్లు కలుస్తున్నారని, కలవని వాళ్లని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. అయితే అత్యధిక మెజారిటీతో […]
ఏపీ సీఎం జగన్ పట్ల సినీ పరిశ్రమ ఎందుకు వివక్ష చూపిస్తోందని పృధ్వీరాజ్ ప్రశ్నించారు. తాజాగా సినీనటులు రాజేంద్రప్రసాద్ జగన్ పై చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. జగన్ సీఎం అయితే కలవాలా, సినిమా వాళ్ళు వ్యాపారస్తులా అని రాజేంద్రప్రసాద్ వ్యంగ్యంగా మాట్లాడడంలో ఎలాంటి అర్థం ఉందో చూడాలన్నారు. గతంలో చంద్రబాబును కలిసినప్పుడు ఇదంతా గుర్తులేదా అని ప్రశ్నించారు. సీఎంని కలిసే వాళ్లు కలుస్తున్నారని, కలవని వాళ్లని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. అయితే అత్యధిక మెజారిటీతో జగన్ గెలిస్తే ఒక్క అభినందన కూడా లేదన్నారు. సినీ పరిశ్రమ అంతా కలిసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపితే ప్రపంచమంతా గర్వపడి ఉండేదని అన్నారు. చంద్రబాబు 30 ఏళ్లలో చేయలేని పనులు జగన్ 30 రోజుల్లో చేసి చేశారని పృధ్వీరాజ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత అచ్చన్నాయుడు, వర్ల రామయ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో పదవి ఇవ్వలేదని బోరున ఏడ్చిన రోజులు గుర్తు లేవా అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు దివంగత రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంతోమంది సినీ పరిశ్రమ వాళ్లు లబ్ధి పొందారని గుర్తు చేశారు. జగన్ గురించి ఎవరు తక్కువగా మాట్లాడినా ఊరుకునేది లేదన్నారు.