మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న ధరలు..
ఏపీలో మద్య పానం మరింత ప్రియం కానుంది. అక్టోబర్ నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానున్న నేపథ్యంలో ధరలు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ధరలు పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ మంది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఎంత పెంచాలనే దానిపై ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖలు కసరత్తు చేస్తున్నాయి. ఆదాయం తగ్గకుండా.. గతేడాది కంటే ఎక్కువ ఆదాయం రావాలంటే ధరలు పెంచడం ఒక్కటే మార్గమని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం ఉన్న ధరలను 10 […]
ఏపీలో మద్య పానం మరింత ప్రియం కానుంది. అక్టోబర్ నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానున్న నేపథ్యంలో ధరలు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ధరలు పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ మంది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఎంత పెంచాలనే దానిపై ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖలు కసరత్తు చేస్తున్నాయి. ఆదాయం తగ్గకుండా.. గతేడాది కంటే ఎక్కువ ఆదాయం రావాలంటే ధరలు పెంచడం ఒక్కటే మార్గమని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం ఉన్న ధరలను 10 శాతం పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే దీనివల్ల ఉత్పత్రిదారులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాని, ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుంది.
ప్రస్తుతం ఉన్న ధరల కంటే ఎంత పెంచినా ఒక సీసా కనీసం రూ. 10 పెరుగుతుంది. ఎందుకంటే మద్యం అమ్మకాల్లో రూ.10 రౌండాఫ్ విధానం ఉంది. ప్రస్తుత ధరలు అందుకు అనుగుణంగా చివరిలో సున్నాతో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒక రూపాయి పెంచినా.. అది 10 రూపాయలు అవుతుంది. మద్యం నిషేధించబోతున్నామని ప్రభుత్వ ప్రకటించడంతో ఆదాయం కూడా తగ్గించుకుంటుందని అందరూ భావించారు. కాని అందుకు భిన్నంగా వైసీపీ ప్రభుత్వం అంచనాలు వేస్తోంది. గతేడాది ఎక్సైజ్ ఆదాయం రూ.6220 కోట్లు కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8517 కోట్లు వస్తాయని ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేసింది. ఇప్పటికే రాష్ట్రంలో మూడు నెలల నుంచి చీప్ లిక్కర్ ధర పెరిగింది. దీంతో మద్యం వ్యాపారులు బ్రాండ్ మిక్సింగ్ కు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.