నా శాఖపై సమీక్ష పెడతా..ఎవరు అడ్డొస్తారో చూస్తా?- సోమిరెడ్డి

ఎక్కడైనా ఎన్నికలు ముగిసాక పార్టీల మధ్య విమర్శల వాతావరణం సద్దుమణుగుతుంది. అభ్యర్థులు అలా విహార యాత్రలకు వెళ్లి సేద తీరుతూ ఉంటారు. అయిత్ ఏపీలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్‌గా కనిపిస్తుంది. ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంది. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు అధికారికంగా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు కూడా చేశారు. సీఎం సమీక్షలు జరిపితే తప్పేంటి అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. […]

నా శాఖపై సమీక్ష పెడతా..ఎవరు అడ్డొస్తారో చూస్తా?- సోమిరెడ్డి
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 23, 2019 | 5:13 PM

ఎక్కడైనా ఎన్నికలు ముగిసాక పార్టీల మధ్య విమర్శల వాతావరణం సద్దుమణుగుతుంది. అభ్యర్థులు అలా విహార యాత్రలకు వెళ్లి సేద తీరుతూ ఉంటారు. అయిత్ ఏపీలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్‌గా కనిపిస్తుంది. ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంది. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు అధికారికంగా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు కూడా చేశారు. సీఎం సమీక్షలు జరిపితే తప్పేంటి అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘానికి, వైసీపీకి ఆయన సవాల్ విసిరారు. వ్యవసాయ శాఖపై సమీక్ష జరుపుతామన్నారు. ఎవరు అడ్డొస్తారో చూస్తానన్నారు సోమిరెడ్డి. ఎవరైనా తన సమీక్షను అడ్డుకొంటే దానిపై సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు. సీఎం, మంత్రులు ఇంట్లో కూర్చోవాలా ? అంటూ ఆయన మండిపడ్డారు. పరిపాలించే హక్కు రాజ్యంగం మాకు కల్పించిందన్నారు. తెలంగాణలో విద్యార్థులు చనిపోతుంటే … ఈసీ బాధ్యత వహిస్తుందా? లేక ప్రభుత్వమా అంటూ సోమిరెడ్డి నిలదీశారు. రిజర్వ్ బ్యాంక్ గైడ్‌లైన్స్ తెలియని ఆనం ఆర్థిక మంత్రిగా ఎలా పనిచేశారంటూ ఎద్దేవా చేశారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు.