AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూల్‌డ్రింక్స్ వల్ల డయాబెటిస్ పెరుగుతోంది ? ఈ డ్రింక్స్ తో ఎందుకు ప్రమాదం ?

కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. 2020లో 22 లక్షల మంది టైప్ 2 డయాబెటిస్‌కు గురయ్యారు. వీటిలో ఉండే అధిక చక్కెర కారణంగా గ్లూకోజ్ స్థాయిలను పెంచి, ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఇది డయాబెటిస్, గుండె జబ్బులకు కారణమవుతుంది. కూల్ డ్రింక్స్ బదులు వాటర్, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు వంటి ఆరోగ్యకరమైన డ్రింక్స్ ను తాగడం మంచిది.

కూల్‌డ్రింక్స్ వల్ల డయాబెటిస్ పెరుగుతోంది ? ఈ డ్రింక్స్ తో ఎందుకు ప్రమాదం ?
Cool Drink Side Effects
Prashanthi V
|

Updated on: Jan 14, 2025 | 4:58 PM

Share

మనలో అందరికి పండుగలు, పార్టీలు, ప్రయాణాలు లేదా స్నేహితులతో కలిసినపుడు కూల్‌డ్రింక్స్ తాగే అలవాటు ఉంటుంది. కానీ ఈ కూల్ డ్రింక్స్ వల్ల ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? ఈ కూల్ డ్రింక్స్ కారణంగా ఏడాదికి 22 లక్షల టైప్ 2 డయాబెటిస్ కేసులు నమోదు అయ్యాయని అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది.

కూల్ డ్రింక్స్ తో ప్రమాదం ?

అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ చేసిన పరిశోధన ప్రకారం.. ప్రతి ఏడాదీ ప్రపంచవ్యాప్తంగా 22 లక్షల మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. వీరిలో 9.8 శాతం మంది కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఈ సమస్యకు గురవుతున్నారు. అంతేకాకుండా 12 లక్షల మంది గుండె సమస్యలు ఎదుర్కొంటున్నారట.

కూల్ డ్రింక్స్ ఎందుకు హానికరం ?

ఈ డ్రింక్స్ అధిక చక్కెరను కలిగి ఉండడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతాయి. ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిస్తాయి. టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులకు కారణమవుతాయట. అందరికీ అవసరమైన పరిష్కారం ఒక్కటే ఉందంటున్నారు. అది కూల్ డ్రింక్స్ బదులు, ఆరోగ్యకరమైన డ్రింక్స్ ను తాగడం బెస్ట్ అంటున్నారు.

ఆరోగ్యకరమైన డ్రింక్స్

వాటర్, కొబ్బరినీళ్లు తాగడం మీకు మంచిది. తీపి లేని పండ్ల రసాలు వంటివి తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలానే ఉంటాయి.

కూల్ డ్రింక్స్ తగ్గిస్తే

ఈ డ్రింక్స్ తాగనందున రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ స్కిన్ మెరుస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మొత్తానికి మీరు కూల్ డ్రింక్స్ ను తాగడం తగ్గించినా.. పూర్తిగా మానేసినా మీరు ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి చిన్న అలవాటు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Follow Us
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!