అశోక్‌ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట.. రామతీర్ధం అనువంశిక ధర్మకర్తగా కొనసాగనున్న మాజీ కేంద్ర మంత్రి

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రామతీర్ధం అనువంశిక ధర్మకర్తగా..

అశోక్‌ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట.. రామతీర్ధం అనువంశిక ధర్మకర్తగా కొనసాగనున్న మాజీ కేంద్ర మంత్రి
Follow us
K Sammaiah

|

Updated on: Jan 28, 2021 | 6:13 PM

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రామతీర్ధం అనువంశిక ధర్మకర్తగా అశోక్‌గజపతిరాజుని తొలగిస్తూ ప్రభుత్వ ఆదేశాలను న్యాయస్థానం కొట్టిపారేసింది. దీంతో రామతీర్ధం అనువంశిక ధర్మకర్తగా అశోక్‌గజపతిరాజు కొనసాగనున్నారు.

రామతీర్ధం విగ్రహాల ధ్వంసం సమయంలో ఆయన అనువంశిక ధర్మకర్తగా ఉన్నారు. అయితే ప్రభుత్వం ధర్మకర్తగా అశోక్‌గజపతిరాజును తొలగించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పిచ్చింది.

ప్రభుత్వ కక్ష సాధింపు ఆటలు భగవంతుడి ముందు సాగవని ఆశోక్‌ గజపతి రాజు అన్నారు. ఆ రాముడే తనను దీవించారని ..ఆయన దీవెనలతోనే తాను రామతీర్ధ ఆలయ ధర్మకర్తగా సేవలందిస్తానంటూ అశోక్‌ గజపతి రాజు ట్వీట్ చేశారు.