మీకు సొంత ఆటో, క్యాబ్, టాక్సీలు ఉన్నాయా?.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
అక్టోబరు 4న వాహనమిత్ర పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ‘వైఎస్ఆర్ వాహనమిత్ర’ ద్వారా ఏడాదికి రూ.10 వేల సాయం అందించనున్నారు. సొంతంగా ఆటో, క్యాబ్, టాక్సీలు నడుపుకుంటున్న వాళ్లకి ఈ పథకం వర్తించనుంది. దరఖాస్తుల స్వీకరణకు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆఫ్లైన్, ఆన్లైన్ తో నేరుగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. నేటి వరకు 94 వేల దరఖాస్తుల పరిశీలనను అధికారులు పూర్తి చేశారు. ఈ నెల 30 వరకు దరఖాస్తులను పరిశీలించనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు […]
అక్టోబరు 4న వాహనమిత్ర పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ‘వైఎస్ఆర్ వాహనమిత్ర’ ద్వారా ఏడాదికి రూ.10 వేల సాయం అందించనున్నారు. సొంతంగా ఆటో, క్యాబ్, టాక్సీలు నడుపుకుంటున్న వాళ్లకి ఈ పథకం వర్తించనుంది. దరఖాస్తుల స్వీకరణకు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆఫ్లైన్, ఆన్లైన్ తో నేరుగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. నేటి వరకు 94 వేల దరఖాస్తుల పరిశీలనను అధికారులు పూర్తి చేశారు. ఈ నెల 30 వరకు దరఖాస్తులను పరిశీలించనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సమర్పించాల్సిన పత్రాలు:
- ఆధార్ కార్డు
- తెల్ల రేషన్ కార్డు
- వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
- డ్రైవింగ్ లైసెన్స్
- బ్యాంక్ పాస్‌బుక్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు తమ, తమ కుల ధృవీకరణ సర్టిఫికేట్లు సమర్పించాల్సి ఉంటుంది.