ఉద్దానం కిడ్నీ బాధితులకో వరం.. కార్పొరేట్ ఆసుపత్రికి ప్రభుత్వ శ్రీకారం

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కిడ్నీ బాధితుల కోసం పలాసలో రీసెర్చ్ సెంటర్‌, డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పలాసలో 200పడకల కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయబోతున్నట్లు అందులో పేర్కొంది. ఇందుకోసం మొత్తం రూ.50కోట్లను కేటాయించనుంది. ఇక అక్కడ అవసరమైన సిబ్బందిని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, రెగ్యులర్ పద్దతిలో తీసుకోనున్నారు. ఇందులో భాగంగా 98కాంట్రాక్ట్ ఉద్యోగాలు, […]

ఉద్దానం కిడ్నీ బాధితులకో వరం.. కార్పొరేట్ ఆసుపత్రికి ప్రభుత్వ శ్రీకారం
Follow us

| Edited By:

Updated on: Sep 03, 2019 | 2:30 PM

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కిడ్నీ బాధితుల కోసం పలాసలో రీసెర్చ్ సెంటర్‌, డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పలాసలో 200పడకల కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయబోతున్నట్లు అందులో పేర్కొంది. ఇందుకోసం మొత్తం రూ.50కోట్లను కేటాయించనుంది. ఇక అక్కడ అవసరమైన సిబ్బందిని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, రెగ్యులర్ పద్దతిలో తీసుకోనున్నారు. ఇందులో భాగంగా 98కాంట్రాక్ట్ ఉద్యోగాలు, 60ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు రానున్నాయి. కాగా పాదయాత్ర సమయంలో ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలు తీరుస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇక ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన మూడు నెలలకు ఆ హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేశారు సీఎం జగన్.