AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిడ్నీ రోగులకు అండగా ఏపీ ప్రభుత్వం.. రూ.50 కోట్లతో ఆస్పత్రికి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో కిడ్నీబాధితుల సమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతం శ్రీకాకుళం జిల్లా ఉద్దానం. ఈ సమస్యపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయ తీసుకుంది. కిడ్నీ బాధితుల కోసం పలాసలో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ఆస్పత్రికి అనుసంధానంగా రీసెర్చ్‌ సెంటర్‌, డయాలసిస్‌ యూనిట్‌ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రితో పాటు కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, డయాలసిస్‌ యూనిట్‌కు రూ.50కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. కిడ్నీ బాధితుల […]

కిడ్నీ రోగులకు అండగా ఏపీ ప్రభుత్వం.. రూ.50 కోట్లతో  ఆస్పత్రికి గ్రీన్ సిగ్నల్
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 04, 2019 | 12:06 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో కిడ్నీబాధితుల సమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతం శ్రీకాకుళం జిల్లా ఉద్దానం. ఈ సమస్యపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయ తీసుకుంది. కిడ్నీ బాధితుల కోసం పలాసలో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ఆస్పత్రికి అనుసంధానంగా రీసెర్చ్‌ సెంటర్‌, డయాలసిస్‌ యూనిట్‌ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రితో పాటు కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, డయాలసిస్‌ యూనిట్‌కు రూ.50కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది.

కిడ్నీ బాధితుల సమస్యలు కళ్లారా చూసిన సీఎం జగన్:

ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు ముందు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సమయంలో ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యల్ని కళ్లారా చూశారు. అప్పుడే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే భాధితులకు నెలకు రూ.10వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అధికారాన్నిచేపట్టిన తొలిరోజు నుంచే ఆ హామీని అమలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,500 మందికి నెలకు రూ.10 వేల చొప్పున రూ.8.50 కోట్లను చెల్లిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హాయాంలో కూడా రాష్ట్రంలో ఉన్న 4 వేలమంది కిడ్నీ రోగులకు నెలకు రూ.2500 ఫించన్ అందించారు. కానీ జగన్ సీఎం అయ్యాక దాన్ని పదివేలు చేయడంపై ఉద్దానం కిడ్నీ బాధితుల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసింది. తాజాగా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి రూ.50 కోట్ల ఖర్చుతో కిడ్నీ రోగుల కోసం ప్రత్యేక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్జ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ నిర్మించేందుకు నిర్ణయించింది. దీంతో కిడ్నీ రోగులు, వారి బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అత్యధికంగా శ్రీకాకుళంలోనే :

రాష్ట్రంలో ఉన్న కిడ్ని రోగులందరికంటే శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోనే అత్యధికంగా దాదాపు 112 గ్రామాల్లో అధికంగా కిడ్నీ బాధితులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. అదే విధంగా కృష్ణా జిల్లా జి.కొండూరు, ప్రకాశం జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో డయాలసిస్‌ బాధితులు ఉన్నారు.

Follow Us
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే