ఆ వార్తలు అవాస్తవం.. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ క్లారిటీ

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోందని ఈరోజు ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో విరివిగా ప్రచారం జరిగింది.

ఆ వార్తలు అవాస్తవం.. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ క్లారిటీ
Follow us

| Edited By:

Updated on: Jul 10, 2020 | 10:03 PM

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోందని ఈరోజు ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో విరివిగా ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలు అవాస్తవమని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్‌ కె. వెంకట రామిరెడ్డి స్పష్టం చేశారు. పదవీ విరమణ వయస్సును తగ్గించాలని గానీ పెంచాలనే ప్రతిపాదన గానీ ప్రభుత్వం దగ్గర లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు కావాలని కుట్ర చేస్తున్నారని, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి నిరాధర వార్తల పట్ల ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఇక ఇలాంటి పుకార్లు సోషల్ మీడియాలో వచ్చినప్పుడు వాటి పూర్వాపరాలు పరిశీలించకుండా ఇతరులకు పంపకండని ఆయన కోరారు. దీనిపై ఏపీ డీజీపీ గారిని కలిసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతామని వెంకట రామిరెడ్డి వెల్లడించారు.

Latest Articles
తెలుగు రాష్ట్రాల్లో ఈసెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల
తెలుగు రాష్ట్రాల్లో ఈసెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల
ఈ పార్టీలో ఆధిపత్య పోరుకు చెక్.. గెలుపే లక్ష్యంగా నేతల ప్రచారం..
ఈ పార్టీలో ఆధిపత్య పోరుకు చెక్.. గెలుపే లక్ష్యంగా నేతల ప్రచారం..
సేల్‌లో ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 5 వేలకిపైగా..
సేల్‌లో ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 5 వేలకిపైగా..
వృద్ధులకు బెస్ట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్..ఐదేళ్లలో ఎంత వస్తుంది
వృద్ధులకు బెస్ట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్..ఐదేళ్లలో ఎంత వస్తుంది
ప్రీమియం స్కూటర్లను రిలీజ్ చేసిన ఆంపియర్
ప్రీమియం స్కూటర్లను రిలీజ్ చేసిన ఆంపియర్
పెట్రోల్ బంకు యాజమాని న్యూ ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న జనం..
పెట్రోల్ బంకు యాజమాని న్యూ ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న జనం..
నాయిస్ నయా సేల్ షురూ.. ఆ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు
నాయిస్ నయా సేల్ షురూ.. ఆ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు
ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు
ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు
తెలంగాణ గ్రూప్‌ 1 అభ్యర్ధులకు టీఎస్పీయస్సీ కీలక అప్‌డేట్..
తెలంగాణ గ్రూప్‌ 1 అభ్యర్ధులకు టీఎస్పీయస్సీ కీలక అప్‌డేట్..
ఈ గింజలు ఏం చేస్తాయిలే అనుకునేరు.. ఇలా చేస్తే సమస్యలన్నీ హాంఫట్
ఈ గింజలు ఏం చేస్తాయిలే అనుకునేరు.. ఇలా చేస్తే సమస్యలన్నీ హాంఫట్