AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్‌.. ఇక‌పై రూ.2,500..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత నుంచి వైఎస్ జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. అందులో భాగంగానే వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చారు. ఇక ప్ర‌స్తుతం క‌రోనా కాలంలో కూడా 10 ల‌క్ష‌ల కోవిడ్ టెస్టులు చేసి రికార్డు...

ఏపీ పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్‌.. ఇక‌పై రూ.2,500..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 10, 2020 | 5:24 PM

Share

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత నుంచి వైఎస్ జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. అందులో భాగంగానే వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చారు. ఇక ప్ర‌స్తుతం క‌రోనా కాలంలో కూడా 10 ల‌క్ష‌ల కోవిడ్ టెస్టులు చేసి రికార్డు నెల‌కొల్పారు. ఇప్పుడు అందులో భాగంగానే ఏపీలోని పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి వారికి ఇచ్చే పెన్ష‌న్ మొత్తం పెర‌గ‌నుంది.

ప్ర‌స్తుతం పెన్ష‌న్ దారుల‌కు నెల‌కు రూ.2,250 పింఛ‌ను వ‌స్తుంది. వ‌చ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయ‌లు అంద‌నుంది. వృద్ధులు, వితంతులు, ఒంటరి మ‌హిళ‌ల‌కు ఈ పెన్ష‌న్‌ని గ్రామ‌, వార్డు వాలంటీర్లు అంద‌జేస్తారు. తాము అధికారంలోకి వ‌స్తే పింఛ‌ను సొమ్మును ఏడాదికి రూ.250 చొప్పున పెంచుకుంటూ వెళ్తామ‌ని.. వైఎస్ జ‌గ‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ ప్ర‌కారం జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేపట్టి ఏడాది పూర్త‌యింది. ఈ క్ర‌మంలో ఆగ‌ష్టు నుంచి పెన్ష‌న్ మొత్తం పెంచుతున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

కాగా  ఈ నెల 15న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఆ రోజున ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయం ఒకటో బ్లాక్​లో మంత్రి మండ‌లి భేటీ జరగనుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలు, క‌రోనా‌ నియంత్రణ చర్యలపై స‌హా పలు అంశాలపై చర్చించి మంత్రి వ‌ర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలను రెడీ చేయాలని సంబంధిత అధికారుల‌కు సీఎస్ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. జూలై 13 సాయంత్రం 5 గంటలలోపు ప్రతిపాదనలు సిద్ధంగా ఉండాల‌ని సూచించారు.

Read More:

ఎమ్మెల్యే రోజా గ‌న్‌మెన్‌కి క‌రోనా పాజిటివ్‌..

చైనా బ్రాండ్ ఫోన్ ప్ర‌చారానికి గుడ్ బై చెప్పిన యంగ్ హీరో..?

డ్వాక్రా మ‌హిళ‌ల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ శుభ‌వార్త‌..

Follow Us
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
18 ఏళ్లకే యువ నటి దుర్మరణం.. ముంచుకొచ్చిన మృత్యువు!
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
రైల్వేశాఖ కొత్త లగేజీ రూల్స్.. అంతా ఆన్‌లైన్‌లోనే..
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు