డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త..
వైఎస్ఆర్ ఆసరా పథకం కింద డ్వాక్రా గ్రూపు సభ్యుల రుణాల్లో తొలి విడతను మాఫీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 4 విడతలుగా ఈ రుణాలను మాఫీ చేస్తామని సీఎం జగన్ గతంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే కదా. ఆ మేరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 9 లక్షల 33 వేల సంఘాల సభ్యులకు..

ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నుంచి వైఎస్ జగన్.. ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అందులో భాగంగానే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇక అందులోనూ ప్రస్తుతం కరోనా కాలంలో కూడా 10 లక్షల కోవిడ్ టెస్టులు చేసి రికార్డు నెలకొల్పారు. తాజాగా వైఎస్ఆర్ ఆసరా పథకం కింద డ్వాక్రా గ్రూపు సభ్యుల రుణాల్లో తొలి విడతను మాఫీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 4 విడతలుగా ఈ రుణాలను మాఫీ చేస్తామని సీఎం జగన్ గతంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే కదా.
ఆ మేరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 9 లక్షల 33 వేల సంఘాల సభ్యులకు రూ.27,168 కోట్ల రుణం ఉన్నట్లు అధికారులు గతేడాది గుర్తించారు. దీంతో మొదటి విడతగా రూ.6,792 కోట్లు చెల్లించాలి. ఈ పథకాన్ని సెప్టెంబర్ 11వ తేదీన ప్రారంభించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.
తాజాగా ప్రభుత్వం మాఫీ సొమ్మును నేరుగా డ్వాక్రా సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. నిధులను కార్పొరేషన్ల ద్వారా విడుదల చేయనుంది. ఇందు కోసం వారికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తోంది ఏపీ సర్కార్. జులై నెలాఖరు వరకూ ఈ ప్రక్రియ కొనసాగనుంది.
కాగా తాజాగా జులై 8న ఇళ్ల స్థలాల పంపిణీ చేయాల్సి ఉండగా కరోనా కారణంగా ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ సమయంలో అందరూ ఒకే చోట గుంపుగా చేరే అవకాశం ఉంది. దీంతో వైరస్ ప్రభలే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమాన్ని రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. ఒకవేళ కుదిరితే ఆగష్టు 15న ఇళ్ల స్థలాల పట్టాలను పంచాలని జగన్ సర్కార్ యోచిస్తోంది.
Read More:
Gold rate@51K. రాబోతున్న శ్రావణ మాసం ఎఫెక్ట్‌తో ఇంకా పెరుగుతుందా!
గీతా ఆర్ట్స్ పేరుతో అమ్మాయిలకు వల.. బన్నీ పక్కన హీరోయిన్ అంటూ..