జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రతీ జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్..

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ జిల్లాలోనూ రూ. కోటి వ్యయంతో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రతీ జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్..
Follow us

|

Updated on: Jul 11, 2020 | 12:14 PM

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ జిల్లాలోనూ రూ. కోటి వ్యయంతో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర కోవిడ్ 19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్ కృష్ణబాబు వెల్లడించారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులకు అనుగుణంగా క్వారంటైన్‌లో వసతులు మెరుగుపరచాలని నిర్ణయించినట్లు ఆయన అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు సూచనలు ఇచ్చారని పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రతీ జిల్లాలోనూ 3000 బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్న ఆయన.. మున్ముందు వాటిని 5000కు పెంచుతామని తెలిపారు. అలాగే ప్రతీ జిల్లాకు రూ. కోటి నిధులను మంజూరు చేశామన్నారు. వీటితో అత్యాధునిక సదుపాయాలతో కూడిన కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ల్యాబ్, ఎక్స్‌రే, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు అన్నీ కూడా ఉంటాయన్నారు. ఇక కొన్ని కోవిడ్ సెంటర్లలో ఆహారం నాణ్యత బాలేదని ఫిర్యాదులు వచ్చాయని.. అవి సీఎం దృష్టికి వెళ్లాయని కృష్ణబాబు చెప్పారు. మెనూ ప్రకారమే ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు.

కోవిడ్ కేర్ సెంటర్లలో ఆహారం సరఫరా విషయంలో ఐఆర్‌టీసీ సలహాలు తీసుకుని పంపిణీకి సిద్దమవుతున్నట్లుగా తెలిపారు. కోవిడ్ కేర్ సెంటర్ల డెవలప్‌మెంట్‌ కోసం జాయింట్ కలెక్టర్లకు సీఎం అదనపు బాధ్యతలను అప్పగించారు. కాగా, జూన్ 30 వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేస్తామని కృష్ణబాబు పేర్కొన్నారు. అటు రాష్ట్రానికి వచ్చిన ప్రతి ఒక్కరి డేటాను ప్రభుత్వం సేకరిస్తోందని.. వారిని మోనిటర్ చేసే బాధ్యత గ్రామ సచివాలయాలకు అప్పగించినట్లు కృష్ణబాబు తెలిపారు.

Also Read:

తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్‌లో 30% కోత.!

భక్తులకు ముఖ్య గమనిక.. వాటి జోలికి వెళ్లొద్దంటూ టీటీడీ హెచ్చరిక..

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నెల 13 నుంచి వీడియో పాఠాలు..

ఏపీ ప్రజలకు గమనిక.. ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!