AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ద్యావుడా.. ఒకేసారి ఇద్దరికీ తాళి కట్టేశాడు

ప్రేమించిన అమ్మాయి, పెద్దలు చూసిన అమ్మాయి.. ఇద్దరికీ ఒకేసారి తాళికట్టి అందరిని మెప్పించాడు ఆ యువకుడు. అద్భుతమైన ఈ వివాహ బంధం మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఈ వివాహ మహోత్సం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది...

ద్యావుడా.. ఒకేసారి ఇద్దరికీ తాళి కట్టేశాడు
Sanjay Kasula
|

Updated on: Jul 11, 2020 | 11:22 AM

Share

Man Marries Two Women at Same Time : తను మెచ్చింది ఒకరు…పెద్దలకు నచ్చింది మరొకరు.. అయితే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లా కాకుండా… ఇద్దరిని ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. కుటంబ సభ్యులను మెప్పించాడు… ప్రేమించిన అమ్మాయిని మనువాడాడు.

ప్రేమించిన అమ్మాయి, పెద్దలు చూసిన అమ్మాయి.. ఇద్దరికీ ఒకేసారి తాళికట్టి అందరిని మెప్పించాడు ఆ యువకుడు. అద్భుతమైన ఈ వివాహ బంధం మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఈ వివాహ మహోత్సవం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. బేతుల్ జిల్లాలోని కెరియా గ్రామానికి చెందిన సందీప్ చదువుకుంటున్న సమయంలో ఓ యువతి ప్రేమలో పడ్డాడు. వారు తెలుగు సినిమాలోలా.. చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండగానే, ఈ విషయం తెలియని సందీప్ తల్లిదండ్రులు అతడికి పెళ్లి చేసేందుకు మరో యువతితో సంబంధం కుదుర్చుకున్నారు.

విషయం ప్రేమికురాలి కుటుంబ సభ్యులకు తెలియడంతో వ్యవహారం కెరియా గ్రామ పంచాయితీకి చేరింది. సమస్య పరిష్కారం కోసం పెద్దలు మూడు కుటుంబాలను పిలిపించి పంచాయితీ పెట్టారు. అయితే, ఇక్కడే మరో ట్విస్టు చోటుచేసుకుంది. తామిద్దరం అతడితోనే కలిసి జీవిస్తామని ఇద్దరు యువతులు మంకుపట్టు పట్టారు. వారి నిర్ణయాన్ని పెద్దలు కూడా ఎదురుచెప్పలేకపోయారు. ఇద్దరినీ పెళ్లాడేందుకు సందీప్ కూడా ఓకే చెప్పడంతో కెరియా గ్రామంలో పెళ్లి సందడి మొదలైంది.  బంధుమిత్రుల మధ్య వివాహం ఘనంగా జరిగింది. ద్యావుడా.. ఒకేసారి ఇద్దరికీ తాళి కట్టేశాడు.. ఈ ఘటన శోభన్ బాబు, వాణి శ్రీ, శారద నటించిన ‘ఎవండి… ఆవిడవచ్చింది’, ‘బ‌ృందావనం’లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాను గుర్తు చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో అధికారులు దృష్టి పెట్టారు. కరోనా వైరస్‌ రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తున్న సమయంలో వివాహాలకు ఎలాంటి అనుమతి లేదని స్థానిక తహసీల్దార్ మౌనిక విశ్వకర్మ తెలిపారు. వివాహానికి ఎలాంటి అనుమతి తీసుకోలేదని.. ఈ ఘటనపై విచారణ జరుపుతామని వెల్లడించారు.