గుడ్ న్యూస్..ఇసుక అక్రమ రవాణాకు చెక్ చెప్పండిలా..

ఏపీలో ఇసుక కొరత విషయంలో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడ్డ సంగతి తెలిసిందే. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటూ ఒకవైపు జనసేన లాంగ్ మార్చ్ నిర్వహిస్తే..మరో వైపు బాబు ఒక రోజు దీక్ష చేశారు. కాగా వరదల కారణంగానే కొరత ఏర్పడిందని..త్వరలోనే ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తామని అధికార వైసీపీ చెబుతోంది. ఇదంతా పక్కన పెడితే ఇసుక స్మగ్లింగ్ విషయంలో సీఎం జగన్ మొదట్నుంచి కఠినంగానే వ్యవహరిస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలపై ఆరోపణలొస్తే డైరెక్ట్‌గా పిలిచి వార్నింగ్ […]

గుడ్ న్యూస్..ఇసుక అక్రమ రవాణాకు చెక్ చెప్పండిలా..
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 18, 2019 | 1:28 PM

ఏపీలో ఇసుక కొరత విషయంలో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడ్డ సంగతి తెలిసిందే. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటూ ఒకవైపు జనసేన లాంగ్ మార్చ్ నిర్వహిస్తే..మరో వైపు బాబు ఒక రోజు దీక్ష చేశారు. కాగా వరదల కారణంగానే కొరత ఏర్పడిందని..త్వరలోనే ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తామని అధికార వైసీపీ చెబుతోంది. ఇదంతా పక్కన పెడితే ఇసుక స్మగ్లింగ్ విషయంలో సీఎం జగన్ మొదట్నుంచి కఠినంగానే వ్యవహరిస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలపై ఆరోపణలొస్తే డైరెక్ట్‌గా పిలిచి వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో ఇసుక దోపిడిని చాలావరకు కట్టడి చేయగలిగారు.

తాజాగా ఇసుక తరలిపోకుండా కాపాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం వినూత్న ఆలోచనతో ప్రజల ముందుకు వచ్చింది. ఎక్కడైనా స్మగ్లింగ్ జరుగుతుంటే అధికారులకు సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇసుకను ఎవరైనా అక్రమంగా తరలిస్తుంటే.. 14500 నంబర్‌కు ప్రజలు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే అధికారులు దోపిడికి పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటారు. ఈ ప్రొగ్రాంను ఈ రోజు సీఎం జగన్ సమక్షంలో మంత్రులు, అధికారులు ప్రారంభించారు. ఇక ఇసుక అక్రమ రవాణా చేస్తూ దొరికిపోతే భారీగా జరిమానా, శిక్షలు విధించనున్నట్లు ఏపీ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.