నేడే ఏపీ కేబినెట్ తొలి సమావేశం

మరి కాసేపట్లో ఏపీ కొత్త మంత్రి వర్గం భేటీ కాబోతోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తొలి సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీలో పలు కీలకాంశాలు చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం బాధ్యతలు చేపట్టిన జగన్.. పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. వాటిపై ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా రైతుకు భరోసా ఇవ్వడమే లక్ష్యంగా సీఎం జగన్ కీలక హామీకి ఆమోద ముద్ర వేయనున్నారు. రైతులు, […]

నేడే ఏపీ కేబినెట్ తొలి సమావేశం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 10, 2019 | 8:12 PM

మరి కాసేపట్లో ఏపీ కొత్త మంత్రి వర్గం భేటీ కాబోతోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తొలి సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీలో పలు కీలకాంశాలు చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం బాధ్యతలు చేపట్టిన జగన్.. పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. వాటిపై ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

ముఖ్యంగా రైతుకు భరోసా ఇవ్వడమే లక్ష్యంగా సీఎం జగన్ కీలక హామీకి ఆమోద ముద్ర వేయనున్నారు. రైతులు, మహిళలు, అవ్వా తాతలు, వికలాంగులు, ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలే ప్రధాన ఎజెండాగా సీఎం తొలి కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు సచివాలయం ఫస్ట్ బ్లాకులోని మొదటి అంతస్తులో ఉన్న మంత్రి వర్గ సమావేశ మందిరంలో..  సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది.

ఎన్నికల ప్రణాళికలో వైఎస్‌ఆర్ రైతు భరోసా కింద ఏడాదికి ఒక్కొ రైతు కుటుంబానికి పెట్టుబడి సాయంగా 12,500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి అమలు చేస్తామని ఎన్నికల హామీలో పేర్కొన్నప్పటికీ ఈ రబీ నుంచే ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు తొలి కేబినెట్‌లో ఆమోద ముద్ర వేయడానికి సీఎం ముందడుగు వేశారు. ఇప్పటికే వ్యవసాయ రంగం సమీక్షలో రబీ నుంచే రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం ప్రకటించినప్పటికీ.. మంత్రిమండలి ఆమోదించాల్సి ఉంది. అక్టోబర్ 15 నుంచి వైఎస్సార్ భరోసా పథకం అమలును పెద్ద ఎత్తున చేపట్టాలని జగన్ నిర్ణయించారు.

దీనితో పాటు వచ్చే నెల నుంచి అవ్వా తాతలు, వితంతువులతో పాటు మత్స్యకారులు, చేనేత కార్మికులకు రూ. 2,250, వికలాంగులకు రూ. 3000, డయాలసిస్ రోగులకు రూ. 3,500 నుంచి రూ.10 వేల పించన్ పెంపు నిర్ణయంపై ఆమోద ముద్ర వేయనున్నారు. పించన్ అర్హత వయస్సు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో ఏ విధంగా విలీనం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్, హోం గార్డులు, మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రంలోని 42 వేల మంది ఆశా వర్కర్ల వేతనాలను రూ. 3,000 పెంచుతూ కూడా మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది.

కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంపై చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాజీ సీఎస్ టక్కర్ కమిటీ సిఫార్సులను మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. సీపీఎస్ ఉద్యోగులకు తక్కువ పెన్షన్ వస్తున్న మాట వాస్తవమేనని.. ఈ నేపథ్యంలో సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయడమా.. లేక సీపీఎస్ పెన్షన్ పాత విధానం మధ్య ఉన్న వ్యత్యాసానిని తగ్గించేందుకు ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడమా అన్న దానిపై మంత్రి వర్గం చర్చించనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సీపీఎస్ విధానంలోకి వెళ్లడమా.. లేదా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమేనని చెప్పింది. ఈ విషయంలో కూడా మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది.