వైఎస్‌ఆర్ బాటలో..రైతులకు సీఎం జగన్ వరాలు

దివంగత నేత, ఏపీ మాజీ సీఎం వైఎస్‌ఆర్ తన పాలనలో రైతుల కోసం అనేక పథకాలను తీసుకొచ్చారు. రైతుబంధుగా పేరు తెచ్చుకొని 2009లో మహాకూటమిని ఓడించి తిరిగి అధికారంలోకి రాగలిగారు. తండ్రి బాటలోనే తాజా ఏపీ సీఎం జగన్ రైతులకు పెద్దపీట వేస్తున్నారు.  తొలి కేబినెట్ సమావేశంలోనే రైతులకు లబ్థి చేకూర్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్‌ నుంచి రైతు భరోసా పథకం అమలు చేయాలని సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. […]

  • Ram Naramaneni
  • Publish Date - 7:39 pm, Mon, 10 June 19
వైఎస్‌ఆర్ బాటలో..రైతులకు సీఎం జగన్ వరాలు

దివంగత నేత, ఏపీ మాజీ సీఎం వైఎస్‌ఆర్ తన పాలనలో రైతుల కోసం అనేక పథకాలను తీసుకొచ్చారు. రైతుబంధుగా పేరు తెచ్చుకొని 2009లో మహాకూటమిని ఓడించి తిరిగి అధికారంలోకి రాగలిగారు. తండ్రి బాటలోనే తాజా ఏపీ సీఎం జగన్ రైతులకు పెద్దపీట వేస్తున్నారు.  తొలి కేబినెట్ సమావేశంలోనే రైతులకు లబ్థి చేకూర్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్‌ నుంచి రైతు భరోసా పథకం అమలు చేయాలని సీఎం జగన్ నేతృత్వంలోని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద రైతులకు ఏటా రూ.12,500 పెట్టుబడి సాయం అందించనుంది. అంతేకాదు రైతులందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వనుంది. ఇందుకోసం త్వరలో వైఎస్ఆర్ పేరుతో కొత్త పథకం ప్రకటించనుంది ఏపీ ప్రభుత్వం. పంటకు మద్దతు ధర కల్పించేందు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. అటు ఏపీ రాష్ట్ర రైతు కమిషన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది.

పగటి పూట రైతులకు 9 గంటల ఉచిత కరెంటు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించాలని విద్యుత్ అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. పంట బీమాకు ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకృతి వైపరీత్యంతో పంట నష్టపోతే క్లెయిమ్ డబ్బులు అందించే బాధ్యత కూడా తామే తీసుకుంటామని తెలిపింది. పశువుల బీమాలో భాగంగా రైతుకు గరిష్ఠంగా 5 జీవాలకు బీమా కల్పించనున్నారు. నాటు పశువులు, మేకలకు రూ.15వేలు, సంకరజాతి జంతువులకు రూ. 30వేల బీమా కల్పించనుంది. ఇక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని రైతులకు ఉచితంగా బోర్లు వేయించనున్నారు. ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కో రిగ్గు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 200 రిగ్గులను ఏర్పాటు చేయబోతున్నారు. బోర్లు వేయదలచుకున్న రైతుల వివరాలను నమోదుచేసుకొని ఉచితంగా బోర్లు వేయనున్నారు. పాడి ఉత్పత్తిని పెంచేందు మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.