నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. ఈ సారి 11వేలకు పైగా పోస్టులు

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను అధిగమించే దిశగా అడుగులు వేస్తోన్న జగన్ ప్రభుత్వం.. ఇప్పటికే పలు ఉద్యోగాలను భర్తీ చేసింది. తాజాగా 11వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. తమ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైన పోలీసు నియామక మండలి..11,500పైగా పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది. వీటిలో 340 సబ్‌ ఇన్‌స్పెక్టర్(ఎస్ఐ)పోస్టులు ఉండగా.. 11,356 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరిలో […]

  • Updated On - 8:13 am, Fri, 1 November 19 Edited By:
నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. ఈ సారి 11వేలకు పైగా పోస్టులు

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను అధిగమించే దిశగా అడుగులు వేస్తోన్న జగన్ ప్రభుత్వం.. ఇప్పటికే పలు ఉద్యోగాలను భర్తీ చేసింది. తాజాగా 11వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. తమ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైన పోలీసు నియామక మండలి..11,500పైగా పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది. వీటిలో 340 సబ్‌ ఇన్‌స్పెక్టర్(ఎస్ఐ)పోస్టులు ఉండగా.. 11,356 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ వెలువడనున్న నేపథ్యంలో తమ శాఖలో ఖాళీల వివరాలను పోలీసు నియామక మండలి ప్రభుత్వానికి అందజేసింది. కాగా గతేడాది 3వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా.. ఆ నియామక ప్రక్రియ పూర్తి కావడంతో.. మరోసారి ఖాళీల భర్తీపై దృష్టి సారించింది.

అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ఇస్తామని ప్రకటించిన జగన్.. అధికారంలోకి రాగానే వీక్లీ ఆఫ్ అమలుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జూన్ 19వ తేది నుంచి వీక్లీ ఆఫ్‌లు అమలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 30శాతం సిబ్బందిని అదనంగా నియమించుకోవల్సి ఉంటుంది. ఈ మేరకు అవసరమైన ఖాళీల భర్తీకి పోలీస్ శాఖ సన్నాహాలు చేస్తోంది.