AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ’ వేడుకలు: వారికే సన్మానాలు..!!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర స్థాయిలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకలకు తొలి రోజు ముఖ్య అతిథులుగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హాజరుకానున్నారు. అలాగే పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా అమరజీవిపొట్టి శ్రీరాములుకు నివాళి అర్పించనున్నారు. రాష్ట్ర విభజన […]

'ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ' వేడుకలు: వారికే సన్మానాలు..!!
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 01, 2019 | 8:14 AM

Share

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర స్థాయిలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకలకు తొలి రోజు ముఖ్య అతిథులుగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హాజరుకానున్నారు. అలాగే పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా అమరజీవిపొట్టి శ్రీరాములుకు నివాళి అర్పించనున్నారు.

రాష్ట్ర విభజన అనంతరం ఐదేళ్ల తరువాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ఒరిజినల్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ కొనసాగించాలంటే నవంబర్‌ 1నే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. దీనితో పాటు స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలు చేసిన మహనీయుల వారసులను ఘనంగా సన్మానించనున్నారు.

రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య, పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, కన్నెగంటి హనుమంతు, వావిలాల గోపాలకృష్ణయ్య, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, దామోదరం సంజీవయ్యల వారసులు, బంధువులను ఈ సందర్భంగా ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. వేదికకు ఇరువైపులా చేనేత, హస్తకళలకు సంబంధించిన 21 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. సంగీతం, నృత్యం, నాటకం వంటి లలితకళల ప్రదర్శనలతో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!