Andhra Pradesh: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మన దగ్గరే.. లక్షల్లో జీతం.. అంటూ పోస్టింగ్ ఇచ్చారు.. కట్ చేస్తే, రాత్రికి రాత్రే..

గుంటూరులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.. కోట్లు కొల్లగొట్టి సాఫ్ట్‌వేర్‌ కంపెనీ బోర్డ్‌ తిప్పేసింది.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది.. లక్షలు లక్షలు తీసుకుని తమకు ఉద్యోగాలిచ్చిన కంపెనీ బోర్డు తిప్పేయ్యడంతో.. బాధితులు లబోదిబోమంటున్నారు.

Andhra Pradesh: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మన దగ్గరే.. లక్షల్లో జీతం.. అంటూ పోస్టింగ్ ఇచ్చారు.. కట్ చేస్తే, రాత్రికి రాత్రే..
Guntur Software Scam
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 23, 2024 | 12:59 PM

సాఫ్ట్ వేర్ ఫీల్డ్ పై యువతలో ఉన్న మోజును క్యాష్ చేసుకునేందుకు.. పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్నాయి సాఫ్ట్‌వేర్ కంపెనీలు. కొన్ని కంపెనీలైతే నిరుద్యోగులను నిండా ముంచడమే టార్గెట్‌ పెట్టుకుని ప్లేట్‌ తిప్పేస్తున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేయడమే కాదు… వారికి ఉద్యోగాలు ఇచ్చీ కొన్ని నెలలపాటు పనిచేయించుకుని జీతాలు ఎగ్గొట్టి బోర్డు తిప్పేస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఘటనే గుంటూరులో వెలుగు చూసింది. ఒక్కొక్కరి నుంచి లక్షలు వసూలు చేసి… కోట్లు కొట్టగొట్టి ఉడాయించారు కేటుగాళ్లు..

కొన్ని నెలల క్రితం గుంటూరులో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెట్టారు. భారీగా ఉద్యోగాలు ఇస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వెళ్లాల్సిన పనిలేదు… గుంటూరులోనే పని చేసుకోవచ్చు లక్షల్లో జీతాలు తీసుకోవచ్చంటూ నిరుద్యోగులకు గాలం వేశారు. ఉద్యోగమంటే టాలెంట్‌ చూసి ఇచ్చే కాదు.. డబ్బులు కడితే వచ్చే ఉద్యోగాలివి. ఇక ఉద్యోగంలో జాయిన్‌ అవ్వడానికి ముందే.. ఒకొక్కరిని నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. ఆ తర్వాత ఉద్యోగాలిచ్చారు. నాలుగు నెలలు పనిచేయించుకున్నారు. ఆ తర్వాత జీతాలివ్వకుండా బోర్డ్‌ తిప్పేసి పరారయ్యారు.

ఇక విషయం తెలుసుకున్న బాధితులు… లబోదిబోమంటూ అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..