పీపీఏ రద్దు జగన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం: అజయ్ కల్లం

పీపీఏ(పవర్ పర్చేజ్ అగ్రిమెంట్)ల రద్దు వల్ల పెట్టుబడుల రావని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం మండిపడ్డారు. గత ప్రభుత్వ హయంలో జరిగిన అక్రమాలను సరిదిద్దేందుకే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పున: సమీక్షిస్తున్నామని ఆయన అన్నారు. గతంలో పోలిస్తే విద్యుత్ రేట్లు భారీగా తగ్గాయని, ఈ పరిస్థితుల్లో ఎక్కువ రేట్లు పెట్టి విద్యుత్ కొనాల్సిన అవసరం లేనది ఆయన వెల్లడించారు. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం వైఎస్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:49 pm, Mon, 15 July 19
పీపీఏ రద్దు జగన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం: అజయ్ కల్లం

పీపీఏ(పవర్ పర్చేజ్ అగ్రిమెంట్)ల రద్దు వల్ల పెట్టుబడుల రావని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం మండిపడ్డారు. గత ప్రభుత్వ హయంలో జరిగిన అక్రమాలను సరిదిద్దేందుకే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పున: సమీక్షిస్తున్నామని ఆయన అన్నారు. గతంలో పోలిస్తే విద్యుత్ రేట్లు భారీగా తగ్గాయని, ఈ పరిస్థితుల్లో ఎక్కువ రేట్లు పెట్టి విద్యుత్ కొనాల్సిన అవసరం లేనది ఆయన వెల్లడించారు. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం వైఎస్ జగన్.. అందులో భాగంగా పీపీఏలను రద్దు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు.

పీపీఏల రద్దు వల్ల పెట్టుబడులు వెనక్కివెళ్లిపోతాయని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని.. కానీ ఎలాంటి ఒప్పందాలు లేకుండానే కరెంట్ సరఫరా చేసేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. మొత్తం పీపీఏల ద్వారా రూ.39,700కోట్ల ఒప్పందాలు జరిగాయని.. ఐదేళ్లలో కుదుర్చుకున్న పీపీఏలపై సమీక్షిస్తామని పేర్కొన్నారు. పీపీఏలు లేకుండానే యూనిట్‌ రూ.2.72కు అందిస్తామని.. విద్యుత్ కొనుగోళ్లు పారదర్శకంగా ఉండాలని జగన్ చెప్పారని తెలిపారు. ‘‘2010లో రూ.18 ఉన్న సౌర విద్యుత్ యూనిట్ రూ.2.45 తగ్గింది. పవన విద్యుత్ రూ.4.25 నుంచి 43పైసలకు తగ్గింది. రాష్ట్రంలో సరిపడా విద్యుత్ ఉందని‘‘ అజయ్ కల్లం అన్నారు.

కాగా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్ష కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీలో తాజాగా మార్పులు జరిగాయి. అడ్వకేట్‌ జనరల్‌ స్థానంలో న్యాయశాఖ కార్యదర్శిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత స్థాయి సంప్రదింపు కమిటీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్‌ శ్రీకాంత్‌లు ఉన్నారు.